అరరే..సురభి మిస్సయ్యిందే

  • IndiaGlitz, [Sunday,April 03 2016]

రెండు వ‌రుస విజ‌యాలు అందుకున్నాక ఎవ‌రైనా మూడో విజ‌యం కోసం ఆశ‌ప‌డ‌డం స‌హ‌జం. ఢిల్లీ సుంద‌రి సుర‌భి కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. డీసెంట్ హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న 'బీరువా', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాల త‌రువాత త‌న మూడో చిత్రం 'ఎటాక్‌'తో హ్యాట్రిక్ హిట్ ల‌భిస్తుంద‌న్న ఆశ‌తో ఉన్న సుర‌భికి.. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా నిరాశ‌ప‌రిచింది.

రామ్‌గోపాల్ వ‌ర్మ వంటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్‌లో ప‌నిచేయ‌డం త‌న‌కు లాభిస్తుంద‌నుకుంటే.. అది వ‌ర్క‌వుట్ కాలేదు. హ్యాట్రిక్ ముచ్చ‌ట ప‌క్క‌న పెడితే.. కొంత‌మంది విమ‌ర్శ‌కులు రివ్యూల‌లో సుర‌భి న‌ట‌న గురించి నామ మాత్ర‌మైన ప్ర‌స్తావించ‌నేలేదు. ఇది ఆమెను మ‌రింత నిరాశ‌ప‌రిచే విష‌య‌మే. ఇదిలా ఉంటే.. నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న కొత్త చిత్రంలో సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా అయినా ఆమెకు మ‌రోసారి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

More News

మహేష్ రికార్డ్....

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ..ఇప్పుడు ఇండస్ట్రీ బాక్సాఫీస్ తారక మంత్రం.

'సుప్రీమ్' ఆడియో, మూవీ రిలీజ్ డేట్....

పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’.

'పోలీసోడు' సెన్సార్ పూర్తి....

విజయ్,సమంత,ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన చిత్రం 'తెరి'.

ఊపిరి సీక్వెల్ ప్రకటించిన నాగ్

నాగార్జున-కార్తీ -తమన్నా కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి చిత్రం అటు తమిళ్-ఇటు తెలుగులో ఫీల్ గుడ్ మూవీగా విమర్శకుల ప్రశంసలందుకుంటుంది.

రాశీ ఖన్నా ఇక హైదరాబాద్ అమ్మాయే..

మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి...ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లి భామ రాశీ ఖన్నా.