'జతగా' పాటల రికార్డింగ్ పూర్తి

  • IndiaGlitz, [Monday,October 05 2015]

పాత్రికేయుడిగా, 'సంతోషం' వారపత్రిక అధినేతగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా సురేశ్ కొండేటి స్వయంకృషితో మంచి స్థాయికి ఎదిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విధంగా చిత్రసీమతో సురేశ్ కొండేటికి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేడు (అక్టోబర్ 6) సురేశ్ కొండేటి పుట్టినరోజు. ఎప్పటిలానే నిరాడంబరంగా జరుపుకుంటాననీ, ప్రేక్షకులకు మాత్రం ఓ మంచి సినిమా అందించడానికి కృషి చేస్తున్నానని సురేశ్ చెప్పారు.

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా, రేణి గుంట, మహేష్, డా. సలీమ్... ఇలా ఇప్పటివరకూ పదకొండు విజయవంతమైన చిత్రాలు అందించిన సురేశ్ ఇప్పుడు 'జతగా..' అనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన ఉస్తాద్ హోటల్'ని జతగా...' పేరుతో ఆయన తెలుగులోకి అనువదించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - " ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రం ఇది. ఇటీవలే పాటలను రికార్డ్ చేశాం.శ్రీవల్లి అనే నూతన రచయిత్రి ఓ పాట, ప్రముఖ రచయిత్రి శ్రీమణి ఓ పాట, మరో పాటను ఓ రచయిత రాశారు.

"అమ్మాయి కన్నులు..'' అనే పాటను సమీరా భరద్వాజ్, సాకేత్ కోమండూరి పాడారు.

''చందమామ చందమామ...'' అనే పాటను హరిచరణ్, సాకేత్ కోమండూరి పాడారు.

''చల్ చల్ చల్...'' అనే పాటను మొహమ్మద్ ఇర్ఫాన్, మనీషా ఎర్రాబత్తిని పాడారు.

ఈ చిత్రంలో ఉన్న మూడు పాటలూ కథానుసారం సాగుతాయి.

ఇక, దుల్కర్, నిత్యా మీనన్ జోడీ అద్భుతంగా ఉంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగా కుదిరింది. ఇటీవల విడుదలైన 'ఓకే బంగారం'లో ఈ జంట చేసిన మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైపర్ ఇది. ఇది చాలా అర్థవంతమైన చిత్రం. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన 'జర్నీ', 'పిజ్జా', 'డా. సలీమ్' చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు 'జతగా...'కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్.

More News

అందగత్తెలతో సోగ్గాడే!

సోగ్గాడు అనే టైటిల్ నిజానికి శోభన్ బాబుది.ఆయన తర్వాత తెలుగు పరిశ్రమలో ఆ టైటిల్ కి అర్హుడు అక్షరాలా నాగార్జునే.

మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ర‌వితేజ

'కిక్ 2' డిజాస్ట్ర‌స్ రిజ‌ల్ట్ పొంద‌డంతో క‌థానాయ‌కుడు ర‌వితేజ త‌న ఆశ‌ల‌న్నీ 'బెంగాల్ టైగ‌ర్' పై పెట్టుకున్నాడు. ఈ నెల 18న ఆడియోని, న‌వంబ‌ర్ 5న దీపావ‌ళి కానుక‌గా సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న ఈ సినిమాకి సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అయినా సుకుమార్ వ‌ద‌ల‌డం లేదు

సుకుమార్ సినిమాలు అంటే తెలివితేట‌లకు ప‌రీక్షలు పెట్టే సినిమాలన్న‌ది కొంద‌రి సినిమా ప్రేమికుల మాట‌. అత‌ని గ‌త చిత్రం '1 నేనొక్క‌డినే' అయితే ఇందుకు పూర్తిస్థాయి ఉదాహ‌ర‌ణ‌.

బాహుబ‌లి 1..2..3

తెలుగు సినిమా స్టామినాని ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి ఎవ‌రు ఊహించ‌ని స‌రికొత్త రికార్డు స్రుష్టించింది బాహుబ‌లి.

బ్రూస్ లీ టైటిల్ బ్రూస్ లీ 2 గా మారిందా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెర‌కెక్కించారు. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై దాన‌య్య ఈ సినిమాని నిర్మించారు.