ఓటీటీలో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. అనౌన్స్ చేసిన సూర్య‌

  • IndiaGlitz, [Saturday,August 22 2020]

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. ఆయ‌న లేటెస్ట్ మూవీ ‘శూరరైపోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. అస‌లు థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి. అస‌లు ఓపెన్ అయితే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు ధైర్యంగా వ‌స్తారా? అనే విష‌యాల‌పై క్లారిటీ లేక‌పోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేసిన‌ స్టార్ హీరోలంద‌రూ వారి సినిమాల‌ను విడుద‌ల‌కు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో హీరో సూర్య‌.. ఆకాశం నీ హ‌ద్దురా చిత్రాన్ని అక్టోబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌డానికి ఒప్పుకున్న‌ట్లు తెలిపారు. హీరోగా సూర్య తొలి సినిమాగా ఆకాశం నీ హ‌ద్దురా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. మ‌రి ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను సూర్య ఏవిధంగా మెప్పిస్తారో వేచి చూడాలి.

More News

నెటిజన్లకు బహిరంగ క్షమాపణ చెప్పిన నెట్‌ఫ్లిక్స్..

నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పింది.

తెలంగాణలో లక్ష దాటిన కేసులు.. రాష్ట్రంలో కొత్తగా..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. శనివారం హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'జీ 5' ఒరిజిన‌ల్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సుష్మితా కొణిదెల

మెగాభిమానులకు ఆగస్టు 22న పెద్ద పండగ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు.

స‌మంత ఛాలెంజ్‌.. స‌క్సెస్ అవుతుందా?

లాక్‌డౌన్ స‌మయంలో సినీ సెల‌బ్రిటీలు ఇంటికే ప‌రిమిత‌మై కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా..

డీ గ్లామ‌ర్ పాత్ర‌లో ర‌కుల్‌..?

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అడ‌పా ద‌డ‌పా హిందీ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.