రిలీజ్ డేట్ చెప్పిన సూర్య‌

  • IndiaGlitz, [Monday,March 18 2019]

స్టార్ హీరో సూర్య ఇప్పుడు త‌న 37వ సినిమా 'కాప్పాన్‌'ను సిద్ధం చేస్తున్నాడు. కె.వి. ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌.. చంద్ర‌గాంధ్ వ‌ర్మ అనే ప్ర‌ధాని పాత్ర‌లో న‌టిస్తుంటే ఆయ‌న బాడీ గార్డ్ పాత్ర‌లో సూర్య న‌టిస్తున్నారు. స‌యేషా సైగ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమా విడుద‌ల తేదిని సూర్య ఓ టీవీలో వెల్ల‌డించారు. మోహ‌న్‌లాల్ త‌న లూసిఫ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతున్న‌ప్పుడు సూర్య ఆ ఛానెల్‌కు ఫోన్ చేసి ఆయ‌న‌కు అభినంద‌నలు తెలిపారు.

సూర్య సినిమాలో న‌టించ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంలో 'కాప్పాన్' సినిమాను స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు.