వ‌రుస సినిమాల‌తో సూర్య‌

  • IndiaGlitz, [Sunday,January 07 2018]

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన తాజా త‌మిళ చిత్రం 'తాన సేరంద కూటం'. ఈ చిత్రాన్ని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో అనువదించారు. ఈ రెండు వెర్ష‌న్‌లు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న‌ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూవీ తర్వాత సూర్య వరుస సినిమాలతో తన జోరును పెంచనున్నారు.

ఇప్పటికే సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని లైన్లో పెట్టిన సూర్య‌...కె.వి.ఆనంద్ డైరెక్షన్లో మరో సినిమాను కూడా చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ రెండు చిత్రాలను కూడా ఏకకాలంలో చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. సెల్వ రాఘ‌వ‌న్ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ అతి త్వ‌ర‌లో ప్రారంభం కానుండ‌గా.. కె.వి. ఆనంద్ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని సూర్య తెలిపారు.

గతంలో సూర్య, కె.వి.ఆనంద్ కలయికలో 'వీడొక్కడే', 'బ్రదర్స్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలు రావడంతో...ఈ కాంబోలో రానున్న మూడో చిత్రంపై ఇప్పటినుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా...'సింగం' సిరీస్ డైరెక్టర్ హరి, '24' రూపకర్త విక్రమ్ కుమార్ లతో కూడా కథా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ స్టార్ నటుడు.