close
Choose your channels

సూర్య‌.. ఎందుక‌లా?

Monday, July 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య‌.. ఎందుక‌లా?

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. అయితే సూర్య గ‌త‌ సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకున్న హీరో సూర్య‌కు క‌రోనా బ్రేకులేసింది. సినిమాను సిద్ధం చేసిన సూర్య నెక్ట్స్ మూవీకి రెడీ అయిపోయాడు. ప్ర‌స్తుతం సూర్య రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. సింగం సిరీస్ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. దీనికి అరువా అనే టైటిల్‌ను అనుకున్నారు. త‌ర్వాత అసుర‌న్ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్‌తోనూ సినిమా చేయాల‌ని అనుకున్నాడు.

ఇప్పుడు సూర్య ప్లాన్ మారుస్తున్నాడంటూ సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల మేర‌కు ముందుగా వెట్రిమార‌న్ సినిమాను పూర్తి చేసి త‌ర్వాత హ‌రి సినిమాను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే చిత్రం జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి `వాడివాస‌ల్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. జ‌ల్లిక‌ట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ ఇచ్చే గుమ్మాన్ని వాడివాస‌ల్ అంటారు. తెలుగు టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. సీఎస్‌.చెల్ల‌ప్ప అనే ర‌చ‌యిత రాసిన న‌వ‌ల ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. దానికి సంబంధించిన హ‌క్కుల‌ను కూడా సూర్య అండ్ టీమ్ ద‌క్కించుకుంద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అసుర‌న్ వంటి ర‌స్టిక్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెట్రిమార‌న్.. సూర్య సినిమాను కూడా ర‌స్టిక్‌గానే తెర‌కెక్కిస్తాడ‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.