డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు సూర్య కౌంట‌ర్‌!!

  • IndiaGlitz, [Sunday,May 17 2020]

క‌రోనా ప్ర‌భావంతో ఇప్పుడు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌లో గొడ‌వ‌లు త‌లెత్తాయి. ముఖ్యంగా హీరో సూర్య డిస్ట్రిబ్యూట‌ర్స్, థియేట‌ర్స్ ఓన‌ర్స్ నుండి ఓ రేంజ్ బెదిరింపుల‌నే ఎదుర్కొన్నారు. సూర్య నిర్మాత‌గా మారి ఆయ‌న స‌తీమ‌ణి జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన పొన్‌మ‌గ‌ళ్ వందాల్ సినిమాను సూర్య ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకోగానే థియేట‌ర్స్ సంఘాలు సూర్య‌ను బెదిరించాయి. సూర్య సినిమాల‌ను థియేట‌ర్స్‌లో ఇక‌పై విడుద‌ల చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించాయి. అయితే సూర్య త‌న నిర్ణ‌యాన్ని ఏమాత్రం వెన‌క్కి తీసుకోలేదు. పొన్‌మ‌గ‌ళ్ వందాల్ చిత్రాన్ని ఓటీటీలోనే విడుద‌ల చేస్తున్నారు.

దీనిపై హీరో సూర్య రీసెంట్‌గా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. త‌న‌కు రూ.70 కోట్లు అప్పు ఉంద‌ని అలాంటి స‌మ‌యంలో త‌న అప్పును మరింత పెంచుకోలేన‌ని అందుక‌నే ఓటీటీలో సినిమాను విడుద‌ల చేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. త‌న సినిమాలు ప్లాప్ అయిన‌ప్పుడు త‌న‌కెవ‌రూ హెల్ప్ చేయ‌లేద‌ని సూర్య అన్నారు. త‌న వ్యాపారం తాను చేసుకుంటున్నాన‌ని, సినిమా పెద్ద హిట్టై ఓవ‌ర్‌ఫ్లో అయిన‌ప్పుడు ఎగ్గొట్టే డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ త‌న‌ను ప్ర‌శ్నించడం హాస్యాస్పదంగా ఉంద‌ని సూర్య అన్నారు. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాల‌ను ఓటీటీలోనే ఇక‌పై విడుద‌ల చేస్తాన‌ని, త‌న బ‌డ్జెట్ ప‌రిధి అందులోనే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

More News

ఎన్టీఆర్ క‌థ‌నే ప‌వ‌న్ ఒప్పుకున్నాడా?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమాతో పాటు

మే-31 వరకు లాక్‌డౌన్ 4.0 .. మార్గదర్శకాలివే..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాని కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌ డౌన్‌ 4.0కు కేంద్రం సిద్ధం.. రేపే మార్గదర్శకాలు!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. రేపటితో అనగా ఆదివారం మే-17తో 3.0 లాక్‌డౌన్‌ను ఇండియా పూర్తి చేసుకోనుంది.

తెలుగు మార్కెట్‌పై హీరో విజ‌య్ ఫోక‌స్‌..

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట‌ర్‌`. ఎక్స్‌బీ ఫిలిం క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్జేవియ‌ర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'బాహుబలి'గా మారిన డేవిడ్ వార్నర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.