సూర్య క్రేజీ కాంబో....

  • IndiaGlitz, [Monday,October 30 2017]

సింగం 3 త‌ర్వాత హీరో సూర్య విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద‌కూట్ట‌మ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా త‌ర్వాత సూర్య చేయ‌బోయే సినిమా పలు వార్త‌లు వ‌చ్చాయి. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందని, అలాగే లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని అన్నారు. అయితే ఇప్పుడు సూర్య త‌దుప‌రి సినిమా అధికార‌కంగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది.

ఆ సినిమా ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్‌. 7/జి బృందావ‌న్‌కాల‌నీ, యుగానికొక్క‌డు చిత్రాల ద‌ర్శ‌కుడిగా సెల్వ రాఘ‌వ‌న్‌కు మంచి పేరుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా సినిమా రూపొంద‌నుంది. స్క్రిప్ట్ లాక‌య్యింది. ఈ సినిమా జ‌న‌వ‌రిలో ప్రారంభం అవుతుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై రీసెంట్‌గా విడుద‌లైన కాష్మోరా చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది.

More News

మ‌హేష్ కి అలా.. బ‌న్నీకి ఇలా..

ఒకరిది ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన డేట్‌కి ఒక రోజు ముందు అనే సెంటిమెంట్‌.. మ‌రొక‌రిది ఆ సీజ‌న్‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాన‌న్న సెంటిమెంట్‌తో పాటు ఆ సీజ‌న్‌లోనే ఎక్కువ హిట్‌లు ఇచ్చిన ఘ‌న‌త ఉండ‌డం అనే  సెంటిమెంట్‌.

నివేదా.. రూట్ మార్చుతోందా?

జెంటిల్‌మాన్‌, నిన్ను కోరి, జై ల‌వ కుశ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకుంది కేర‌ళ‌కుట్టి నివేదా థామ‌స్‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ జూలియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్ అనే సినిమాలో న‌టిస్తోంది.

అనుష్క కొత్త చిత్రం

బాహుబ‌లి2లో చేసిన దేవ‌సేన పాత్ర‌తో న‌టిగా మ‌రింత గుర్తింపుని తెచ్చుకుంది అనుష్క‌. ఆ సినిమా విడుద‌లై ఆరు నెలలు గ‌డిచినా.. ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. ఆమె తాజా చిత్రం భాగ‌మ‌తి.. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతోంది.

కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'నా పేరు సూర్య'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంటగా వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.

క్యాన్సర్ పై అవగాహన అత్యవసరం- బాలకృష్ణ

క్యాన్స ర్ పై అవగాహన తెచ్చుకుంటే పూర్తిగా నివారణ పొందవచ్చని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ఆధ్వర్యం లో విశాఖ రామకృష్ణ బీచ్లో క్యాన్సర్ అవగాహన నడక జరిగింది.