close
Choose your channels

న‌వ‌ల ఆధారంగా హీరో సూర్య సినిమా

Tuesday, January 14, 2020 • తెలుగు Comments

న‌వ‌ల ఆధారంగా హీరో సూర్య సినిమా

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు హీరో సూర్య‌. ఈ సినిమా త‌ర్వాత అసుర‌న్ దర్శ‌కుడు వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి `వాడివాస‌ల్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. తెలుగు టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. జ‌ల్లిక‌ట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ  ఇచ్చే గుమ్మాన్ని వాడివాస‌ల్ అంటారు. వివ‌రాల ప్ర‌కారం సీఎస్‌.చెల్ల‌ప్ప అనే ర‌చ‌యిత రాసిన న‌వ‌ల ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. దానికి సంబంధించిన హ‌క్కుల‌ను కూడా సూర్య అండ్ టీమ్ ద‌క్కించుకుంద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అసుర‌న్ వంటి ర‌స్టిక్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెట్రిమార‌న్.. సూర్య సినిమాను కూడా ర‌స్టిక్‌గానే తెర‌కెక్కిస్తాడ‌ని టాక్‌. 

Get Breaking News Alerts From IndiaGlitz