close
Choose your channels

సినీ ఆర్టిస్టులకు భారీ విరాళం అందజేసిన సూర్య..

Friday, August 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీ ఆర్టిస్టులకు భారీ విరాళం అందజేసిన సూర్య..

కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినీ ఆర్టిస్టులను ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకొచ్చారు. సినీ ఆర్టిస్టులకు చేయూతగా భారీ విరాళాన్ని ప్రకటించారు. తన సినిమా ‘సూరరై పోట్రు’కి వచ్చిన తన ఆదాయం నుంచి స్టార్ హీరో సూర్య రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారు. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న 2డి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన సూరరై పొట్రూ 2020 అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఈ సినిమా ఓటీటీలో 200కి పైగా దేశాలలో ప్రదర్శితమవుతోంది. కరోనా కారణంగా సినిమా పరిశ్రమ నిలిచిపోయింది. థియేటర్లు గత ఐదు నెలలుగా మూతపడ్డాయి. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సాంకేతిక నిపుణులు, కార్మికులు కష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలో హీరో సూర్య తన రాబోయే చిత్రం ‘సూరరై పొట్రూ’ ద్వారా వచ్చే ఆదాయం నుంచి 5 కోట్ల రూపాయలను సాధారణ ప్రజలకు, కరోనా యోధులతో పాటు ఫిల్మ్ టెక్నీషియన్లు, కార్మికులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా రూ .1.5 కోట్లను తాజాగా ఎఫ్ఈఎఫ్ఎస్ఐకి విరాళంగా ఇచ్చారు. దీనిలో ఎనభై లక్షల రూపాయల చెక్కును ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు ఆర్.కె. సెల్వమణికి.. రూపాయి ఇరవై లక్షల చెక్కును డైరెక్టర్ యూనియన్ కోసం ఎఫ్ఈఎఫ్ఎస్ఐలో అంతర్భాగమైన టీఏఎన్‌టీఐఎస్ సెక్రటరీ ఆర్.వి. ఉదయ్‌కుమార్‌కి అందజేశారు.

తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోసం నిర్మాత కలైపులి ఎస్.థానుకు రూ.30 లక్షల చెక్కును ప్రత్యేక అధికారికి అప్పగించనున్నారు. రూ.20లక్షల చెక్కును నడిగర్ సంగం కోసం నటుడు నాజర్‌కు అందజేశారు. దీనిని నడిగర్ సంగం ప్రత్యేక అధికారికి ఇవ్వనున్నారు. మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం భారతీరాజా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగింది. కాగా.. సూర్య సినిమా ‘సూరరై పోట్రు’ తెలుగులో ఆకాశమే నీ హద్దురా’గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.