సూర్య ఆ విషయంలో పక్కాగా ఉన్నాడు మరి...

  • IndiaGlitz, [Friday,January 05 2018]

హీరో సూర్య గ్యాంగ్' సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని యు.వి.క్రియేుషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ విడుదల చేస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా..రమ్యకృష్ణ, కార్తిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా సినిమాల్లో ఏదో ఒక పాత్ర మందు లేదా సిగరెట్ కానీ తాగుతూ మనకు తెరపై కనపడుతుంది. అయితే సూర్య గత మూడు చిత్రాలు పసంగ 2', 24', ఎస్3'ల్లో ఈ సన్నివేశాలు కనపడవు. అందుకనే సినిమా ప్రారంభంలో వేసే మద్యపానం, ధూవుపానం కార్డ్‌ను గ్యాంగ్' సినిమాలో కూడా చూపించరని చెప్పారు హీరో సూర్య.