సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్‌ ఉన్న సూర్య ఇందులో హీరో. ‘సూరరై పోట్రు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యే నిర్మాత కావడం విశేషం. ఇందులో కథకు కీలకంగా నిలిచే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్‌బాబు మాత్రమే యాప్ట్‌ అని ఆయన్ను అప్రోచ్‌ అయింది చిత్రబృందం. కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారు.

ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారాయన. కాగా ఈ చిత్రంలో మోహన్‌బాబుని నటింపజేయాలనుకున్నప్పుడు ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్నను సంప్రతించారు సూర్య, సుధ. ఈ ఇద్దరూ లక్ష్మీకి మంచి స్నేహితులు. ఆ విధంగా ఈ సినిమా గురించి తండ్రి దగ్గర లక్ష్మీప్రసన్న చెబితే, కథ నచ్చి ఒప్పుకున్నారు.

ఆరు నెలలకు ముందు ఈ సినిమాకి సైన్‌ చేశారాయన. బాక్సింగ్‌ నేపథ్యంలో హిందీలో ‘సాలా కదూస్‌’, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. ‘ఇరుది సుట్రు’ని తెలుగులో ‘గురు’ పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డైరెక్టర్స్‌లో డిఫరెంట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న సుధ కొంగర తాజాగా సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
 

More News

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు పెట్టిన జగన్!

సీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు వర్తిస్తాయ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. గురువారం నాడు తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకున్నారు.

సాహో టీజర్ రివ్యూ: నేనున్నా.. వాళ్లంతా నా డై హార్డ్ ఫ్యాన్స్! 

‘బాహుబలి 2’ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఈ అంచనాలకు తగ్గట్టుగానే

ఎమ్మెల్యే రోజా అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కకపోవడంతో నగరి నుంచి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే.

డ్రోన్‌లతో ‘జొమాటో’ ఫుడ్‌ డెలివరీ

ఇప్పుడు ఆహారం కావాలంటే హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో యాప్స్ ఉంటే చాలు..

అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. కంగుతిన్న సభ్యులు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరిగింది.