సూర్య టైటిల్ ఫిక్స్ అయ్యింది...

  • IndiaGlitz, [Tuesday,January 01 2019]

'మీట్‌ప్పాన్‌', 'కాప్పాన్‌', 'యురిక్కా' అనే మూడు టైటిల్స్‌లో ఏ టైటిల్ పెడితే బావుంటుందో మీరే చెప్ప‌డంటూ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ ప్రేక్ష‌కుల‌కే చాయిస్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంద‌రూ యురిక్కా అనే టైటిల్‌కే ఎక్కువ‌గా ఓటు కూడా వేశారు.

అయితే ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం 'కాప్పాన్‌' అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. కాప్పాన్ అంటే ర‌క్ష‌కుడు అని అర్థం. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌.. చంద్ర‌గాంధ్ వ‌ర్మ అనే ప్ర‌ధాని పాత్ర‌లో న‌టిస్తుంటే ఆయ‌న బాడీ గార్డ్ పాత్ర‌లో సూర్య న‌టిస్తున్నారు.

స‌యేషా సైగ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆర్య మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు. వ‌చ్చే ఏడాదికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ చిత్రాల త‌ర్వాత సూర్య‌, కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.