సంకాంత్రికి వస్తున్న సూర్య కొత్త చిత్రం

  • IndiaGlitz, [Monday,September 18 2017]

గ‌జినితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. ఇటీవ‌లే క‌థానాయ‌కుడిగా 20 సంవ‌త్స‌రాల‌ను పూర్తిచేసుకున్న సూర్య‌.. ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కత్వంలో త‌న 41వ చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం తానే సేరంద్ర కూట్ట‌మ్ పేరుతో త‌మిళంలో తెర‌కెక్కుతుండ‌గా.. తెలుగు వెర్ష‌న్ కి ఇంకా టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల సంక్రాంతికి వాయిదా వేసార‌ని తెలుస్తోంది. ఎస్‌ 3 త‌రువాత సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ సినిమాపై త‌మిళ‌నాట మంచి అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద హీరోల సినిమాలు బ‌రిలో ఉన్నాయి కాబ‌ట్టి సూర్య చిత్రం కాస్త ఆల‌స్యంగా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

More News

రవితేజ తో ముచ్చటగా మూడోసారి?

కలిసొచ్చిన హీరోయిన్ లకు మరో ఛాన్స్ ఇవ్వడం అనేది సినిమా పరిశ్రమలో తరుచుగా జరిగే విషయమే.

ఈ వారంలో 'పిఎస్ వి గరుడవేగ' టీజర్..!

ఉగ్రవాదం అంటే అభం-శుభం తెలియని జనాల్ని చంపడమే కాదు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తొలి ద్విభాషా చిత్రం స్పైడర్.

రాజుగారిగ‌ది2 ట్రైల‌ర్‌.. మ‌రో రెండు రోజుల్లో

కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశ‌మివ్వ‌డ‌మే కాకుండా.. కొత్త పాత్ర‌ల‌కు చిరునామాగా నిల‌వ‌డంలోనూ అక్కినేని నాగార్జున ముందుంటారు. ప్ర‌స్తుతం నాగ్ చేస్తున్న మ‌రో కొత్త పాత్ర మెంట‌లిస్ట్ క్యారెక్ట‌ర్‌. రాజుగారి గ‌ది2 కోసం ఆయ‌న ఈ పాత్ర‌ని పోషిస్తున్నారు.

యాక్ష‌న్ ఎపిసోడ్‌కి సిద్ధ‌మైన ర‌వితేజ‌

బెంగాల్ టైగ‌ర్ త‌రువాత రెండేళ్ల గ్యాప్‌తో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ నుంచి వ‌స్తున్న  సినిమా రాజా ది గ్రేట్‌. ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.