‘ఎన్.జి.కె’ ఫస్ట్ సింగిల్‌తో సందడి చేస్తున్న సింగం సూర్య

  • IndiaGlitz, [Friday,April 12 2019]

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌ైటెన్‌మెంట్ పతాకాలపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'ఎన్.జి.కె' (నంద గోపాల కృ ష్ణ). ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెమండెస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.

కాగా, శుక్రవారం ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. 'వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే...' అడ్డైమెన మాటలే.. అడ్డేలేక వాగెనే..' అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ అద్భుతంగా పాడారు. ఈ పాటకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం చాలా డిఫరెంట్‌గా ఉంది. సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: జి.కె.ప్రసన్న, ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.

More News

ఇస్మార్ శంక‌ర్ సాంగ్‌లో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 'డబుల్ దిమాక్' ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్

మాసివ్ పెర్ఫార్మెన్స్ 'కాంచ‌న‌-3' లో చూస్తారు - బి. మధు

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా,

జనసేనాని గెలుపు పై రాష్ట్రమంతా ఉత్కంఠ

జనసెనాని పవన్ కళ్యాణ్ వైపు గెలుపు పవనాలు వీస్తాయా? లేదా?... విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం నుంచి పవన్ గెలుస్తారా? లేదా?... వైసీపీ అభ్యర్థి తిప్పలు నాగిరెడ్డికి ఉన్న సానుభూతి

ఒక్కటంటే ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు ఇక్కడ

ఒడిశాలో మావోయిస్టులు మరో సారి తమ ప్రాభల్యాన్ని చాటుకున్నారు.

ఏపీలో 76.69 శాతం ఓటింగ్ నమోదు

ఏపీ లో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతం లో కంటే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.