అఫీషియ‌ల్‌... వెన‌క్కి వెళ్లిన సూర్య‌

  • IndiaGlitz, [Thursday,August 30 2018]

తమిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న త‌మిళ హీరో సూర్య‌. ఆయ‌న హీరోగా ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా విడుద‌ల వాయిదాప‌డేలా క‌న‌ప‌డుతుంది. నిజానికి ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌కి అనారోగ్యం కార‌ణంగా షెడ్యూల్ వాయిదా ప‌డింద‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై యూనిట్ స్పందించింది. సాంకేతిక కార‌ణాల‌తో సినిమా ఆల‌స్య‌మైంద‌ని చెప్పిన యూనిట్ డైరెక్ట‌ర్ అనారోగ్యం గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీపావ‌ళికి వ‌స్తాడ‌నుకున్న సూర్య అభిమాన‌ల‌కు ఇది నిరాశ‌ను క‌లిగించే విష‌య‌మే.