బి.ఎ.రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన సూర్య‌

  • IndiaGlitz, [Sunday,January 07 2018]

సీనియ‌ర్ పాత్రికేయుడు, సూప‌ర్‌హిట్ ప‌త్రిక ఎడిట‌ర్‌, నిర్మాత బి.ఎ.రాజు పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 7. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మక్షంలో జ‌రిగిన పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో బి.ఎ.రాజు బ‌ర్త్‌డే కేక్‌ను క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరో సూర్య‌..బి.ఎ.రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ...

హీరో సూర్య మాట్లాడుతూ - "బి.ఎ.రాజుగారితో ఎప్ప‌టి నుండో నాకు, మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ఆయ‌న‌కు ఎంతో అనుభవం, గ్రిప్ ఉంది. నా సినిమాల‌కు ఆయ‌న ఎప్పుడూ త‌న స‌పోర్ట్‌ను అందిస్తూ వ‌స్తున్నారు. త‌న విలువైన సూచ‌న‌లిస్తుంటారు.

చాలా మంచి హృద‌య‌మున్న వ్య‌క్తి. ఈరోజు ఆయ‌న పాత్రికేయుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటున్న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. బి.ఎ.రాజుగారు ఆయురారోగ్యాల‌తో ఇలాంటి పుట్టిన‌రోజుల‌ను మ‌రిన్ని జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

More News

విష్ణు మంచు ఆచారి అమెరికా యాత్ర టీజర్ విడుదల!

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర టీజర్ విడుదలైనది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ లో వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

'అన్నయ్య'కి 18 ఏళ్ళు

త‌మ్ముళ్ల‌ని ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించే ఓ అన్న క‌థతో తెర‌కెక్కిన చిత్రం 'అన్నయ్య'. మెగాస్టార్‌ చిరంజీవి, సౌందర్య జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి  సెంటిమెంట్ చిత్రాల స్పెష‌లిస్ట్‌ ముత్యాల సుబ్బయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

'అజ్ఞాతవాసి' ట్రైలర్ రివ్యూ

జనవరి 10న పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రం 'అజ్ఞాతవాసి'.

మరో చిత్రంలో రకుల్, సాయిపల్లవి

కాంబినేషన్లను సెట్ చేయడంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధహస్తులు.

'అజ్ఞాతవాసి' తో 'ఎం.ఎల్.ఎ.' వస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం‘అజ్ఞాతవాసి’.