సూర్య 40కి.. ఆ టెక్నీషియ‌న్‌కి 75.. అత‌నెవ‌రో తెలుసా!!

  • IndiaGlitz, [Thursday,January 02 2020]

తమిళంతో పాటు తెలుగులో మార్కెట్‌ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఈయన ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మాతగా ఓ సినిమా చేస్తాడని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో డైరెక్టర్‌ శివ సినిమా చేయబోతున్నాడు. . ఈ సినిమా పూర్తి కావడానికి ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సూర్య ఈలోపు 40వ సినిమాను పూర్తి చేయ‌డానికి రెడీ అయిపోయారు.

సమ్మ‌ర్ నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రీసెంట్‌గా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్‌' దర్శకుడు వెట్రిమారన్‌, నిర్మాత కలైపులి థాను కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా జీవీ ప్ర‌కాశ్‌నే ఖ‌రారు చేశారు. ఆకాశ‌మే నీ హ‌ద్దురా సినిమాకు సంగీతం అందిస్తోన్న జీవీ ప్ర‌కాశ్ వెంట‌నే సూర్యతో ప‌ని చేయ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సూర్య 40వ సినిమా జీవీ ప్ర‌కాశ్ 75వ సినిమా అవుతుంది. సూర్య వంటి డిఫరెంట్‌ సినిమాలు చేయాలనుకునే హీరో, డిఫరెంట్‌ సినిమాలను తెరకెక్కించే వెట్రిమారన్‌లాంటి డైరెక్టర్‌తో సినిమా అంటే సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడతాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సూర్యకు తమిళంతో పాటు తెలుగులో మార్కెట్‌ ఉండటంతో నిర్మాత కలైపులి థానుకి కూడా ఈ ప్రాజెక్ట్‌ కలిసి వచ్చినట్టేనని అనుకోవచ్చు.

More News

‘మా’ పదవికి రాజశేఖర్ రాజీనామా!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్‌..

’సరిలేరు నీకెవ్వరు’! సెన్సార్ పూర్తి

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌,

నాకు, చిరంజీవికి మ‌ధ్య గొడ‌వ‌లేం లేవు... మోహ‌న్‌బాబుని ముద్దాడిన చిరు

`మా` డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో అసోసియేష‌న్ మ‌ధ్య ఉన్న విబేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్త‌నపై చిరంజీవి, మోహ‌న్‌బాబు, కృష్ణంరాజు వంటివారు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

చిరంజీవి వర్సెస్ రాజశేఖర్.. అసలేం జరిగింది!?

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్‌ల మధ్య గొడవలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు.

వెంక‌టేశ్ స‌ర‌స‌న కన్న‌డ భామ‌

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.