సక్సెస్ పై సుశాంత్ పూర్తి నమ్మకానికి కారణం అదే..

  • IndiaGlitz, [Tuesday,June 14 2016]

కాళిదాసు, క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో అల‌రించిన సుశాంత్ తాజా చిత్రం ఆటాడుకుందాం రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ నాగ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్ పై నాగ సుశీల‌, చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధ‌ర్ సీపాన క‌థ అందించ‌గా, అనూప్ మ్యూజిక్ అందించారు. ఇటీవ‌ల జ‌రిగిన షూటింగ్ తో టాకీ పూర్త‌య్యింది.
ప్ర‌స్తుతం పోస్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే అన్నికార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఆటాడుకుందాం రా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.అయితే.. ఈ సినిమా స‌క్సెస్ పై సుశాంత్ పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. దీనికి కార‌ణం ఏమిటంటే... నాగార్జున న‌టించిన సిసింద్రీ చిత్రంలోని పాట ఆటాడుకుందా రా...నే టైటిల్ గా పెట్టుకోవ‌డం...దీనికి తోడు సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ,ఈడోరకం ఆడోరకం...ఇలా స‌క్సెస్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్స్ తీసిన జి. నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు కావ‌డంతో..స‌క్సెస్ పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట‌. మ‌రి..సుశాంత్ న‌మ్మ‌కం నిజం అయి ఆటాడుకుందాం రా తో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

సూపర్ స్టార్ తో కలిసి చేయాలనుందంటున్న బన్ని...

మలయాళ సూపర్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రం ఈ సూపర్ స్టార్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట.

శభాష్ నాయుడు డైరెక్టర్ మారాడు..

కమల్ హాసన్,శృతి హాసన్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం శభాష్ నాయుడు.

క‌ళ్యాణ్ రామ్ - పూరి మూవీ డీటైల్స్..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న అదితి ఆర్య హీరోయిన్ గా న‌టిస్తుంది.

త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం ఇదే..

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...తాజాగా అ ఆ చిత్రంతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే... త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం ఏమిటి అనేది ఆస‌క్తిగా మారింది. ముందు అనుకున్న ప్ర‌కారం...త‌మిళ హీరో సూర్య‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయాలి.

బాహుబలి 2 యుద్ధం ప్రారంభం..

ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.