కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్న ZEE 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయిన హీరో  సుశాంత్..

  • IndiaGlitz, [Friday,March 18 2022]

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడుగా కాళిదాసుచిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన యువ కథా నాయకుడు సుశాంత్..తను కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే కరెంట్, అడ్డా, దొంగాట, అటాడు కుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹ వంటి మొదలగు హిట్ సినిమాలలో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు..అల వైకుంఠ పురములో..సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్ లో నటించి అక్కినేని అభిమానులతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. కరోనా టైం లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'సినిమా ద్వారా మంచి విజయం సాధించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

తాజాగా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లో ఏంతో ఆసక్తి కరమైన కథ సుశాంత్ కు నచ్చడంతో తొలిసారిగా ZEE5 వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకొని నటించడం విశేషం. ప్రస్తుతం ZEE5 లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు ZEE5 వెబ్ సిరీస్ లో నటించ డానికి ముందుకు వచ్చిన సుశాంత్ ను ZEE 5 టీం గ్రాండ్ వెల్ కం చెపుతూ మా రాబోయే వెబ్‌సిరీస్‌కు స్వాగతం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు..

ఇప్పటి వరకు ప్రేక్షకులు సుశాంత్ ను పోలీస్ గెటప్ లో చూడలేదు. పోలీస్ జీప్ ముందు మఫ్టీ లో కూల్ గా నిల్చొని చూస్తున్న ఫోటో ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.ఈ గెటప్ ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ మీద విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ నెల18 న జరిగే సుశాంత్ బర్త్ డే వేడుకలో సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేస్తూ తను నటించే వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ZEE 5 యూనిట్ తెలియజేసింది.

More News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్

పవర్ స్టార్ అనే పేరే ఒక పండగ. అలాంటిది ఆయన సినిమా వస్తోందంటే డబల్ బొనాంజా. అందులోనూ రికార్డులు బద్దలుకొట్టే సినిమా అంటే ఆ ఎనర్జీ వేరు.

ఫలించిన రాజమౌళీ ప్రయత్నాలు.. ‘‘ఆర్ఆర్ఆర్’’ టికెట్ రేట్ల పెంపుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.

ప్రశాంత్ కిశోర్‌తో ఇళయ దళపతి విజయ్ భేటీ.. వేదిక హైదరాబాద్, అసలేం జరుగుతోంది..?

కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాల మరణంతో తమిళ రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని భర్తీ చేసేందుకు అగ్ర కథనాయకులు కమల్ హాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగారు.

పెండింగ్ చలానాలకు మంచి రెస్పాన్స్...  ఖజానాకు ‘‘పైసా వసూల్’’

పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టేవారికి రాయితీ ఇస్తూ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం సత్ఫాలితాలను ఇస్తోంది.

ఈ సొసైటీ గెలిచినవాడి మాటే నమ్ముతుంది ... ఆకట్టుకుంటోన్న వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘‘గని’’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.