Swathimuthyam : 'స్వాతిముత్యం' టీజర్ ట్రైలర్' విడుదల

  • IndiaGlitz, [Wednesday,September 14 2022]

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ‘వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈరోజు చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ ట్రైలర్ పేరుతో ఓ సంక్షిప్త ప్రచార చిత్రం ను విడుదల చేసింది చిత్ర బృందం. దాదాపు నలభై క్షణాల పాటు సాగే ఈ దృశ్య మాలిక ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది.

మన బాలూ ఏంచేసాడో కొంచం నీకర్థమయ్యేలా చెబుతాను...
చెప్పండి...
అంటే .....అదీ....!
కొంపదీసి ఏదన్నా ప్రాబ్లమా
ప్రాబ్లమా.. ప్రాబ్లమ్ ఏముంటుందండి...?
మీరింకా సింగిల్ గా ఎందుకుండిపోయారో నా కిప్పుడర్ధమయింది వంటి సంభాషణలు నాయిక,నాయకుల మధ్య వినిపిస్తాయి. రావురమేష్, వెన్నెలకిషార్ లు కూడా ఇందులో చిత్రానుసారం కనిపిస్తారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల అన్న ప్రకటనతో పాటు, దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు స్వాతిముత్యం ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.

గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

More News

Nenu c/o Nuvvu: ఈ నెల 16 న 'నేను c/o నువ్వు' విడుదల

ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం

kothapalli geetha: రూ.కోట్ల రుణం ఎగవేత.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.

Nene Vasthunna: కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ సమర్పణలో ధనుష్, సెల్వరాఘవన్ లా 'నేనే వస్తున్నా' చిత్రం

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు  విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో "నానే వరువేన్"

రేవంత్ విజయాన్ని అడ్డుకున్న ఫైమా... కెప్టెన్సీ ఛాన్స్ మళ్లీ మిస్

బిగ్‌బాస్ 6 సీజన్ ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. గతంలో నాలుగైదు వారాలు గడిచిన తర్వాత షో ట్రాక్ ఎక్కేది.

Nagashaurya: నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై