బిగ్‌ బీ‌కి బిగ్ థ్యాంక్స్..: సైరా డైరెక్టర్

  • IndiaGlitz, [Saturday,March 16 2019]

బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్న అమితాబ్ బ‌చ్చన్ మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌గురువు పాత్రలో అమితాబ్ క‌నిపించనున్నారు. షూటింగ్‌లో తుది దశకు చేరుకుంది. ఇక తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశాడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటిస్తుండగా , జగపతి బాబు, తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. బిగ్‌బీతో సెల్ఫీ దిగి.. ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.

ట్వీట్ సారాంశం..

ఇది బిగ్‌బి వ్రాప్.. ఇదొక అద్భుతమైన.. బ్రహ్మాండమైన ప్రయాణం. ధన్యవాదములు బిగ్ బీ గారు. మీరు సైరాలో భాగమైనందుకు ధన్యవాదాలు.. మీతో కలిసి పనిచేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానుఅని అమితాబ్‌తో దిగిన సెల్ఫీని సురేందర్ రెడ్డి పోస్ట్ చేశారు.

కాగా.. ఇందుకు పలువురు మెగాభిమానులు, సినీ ప్రియులు, బిగ్ బి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సార్.. దయచేసి సినిమాను ఈ దసరాకి రిలీజ్ చేయండి. ఈలోపు ఏదొక అప్డేట్ ఇవ్వండి. ఒకే రకమైన మ్యూజిక్‌తో, ఒక్కో యాక్టర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తుంటే మాకు కిక్కు రావడంలేదు.. దయచేసి అర్ధం చేసుకోండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.