'సింహంలాంటోడు.. అతడే వాళ్ల ధైర్యం..' ‘సైరా’ టీజర్ రివ్యూ

  • IndiaGlitz, [Tuesday,August 20 2019]

మెగాభిమానులు వేయికళ్లతో వేచిచూస్తున్న ‘సైరా’ టీజర్ మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 2:40 గంటలకు అభిమానుల ముందకు వచ్చేసింది. ఎలాంటి ఆడంభరాలకు పోకుండా సింపుల్‌గా టీజర్ లాంచ్ జరిగింది. అంతేకాదు ఎలాంటి లైవ్ వ్యవహారాలు లేకుండా కేవలం యూట్యూబ్ ‘సైరా’ టీజర్ లాంచ్ పరిమితం కావడం గమానర్హం. తెలుగుతో పాటు పలు భాషల్లో కాస్త గ్యాప్‌తో టీజర్ లాంచ్ చేయడం జరిగింది. మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌ యూ ట్యూబ్‌లో లైవ్ ఈవెంట్ చూడొచ్చు.

టీజర్‌లో ఏముంది..!?

1:47 నిమిషాల నిడివిగల ఈ టీజర్‌లో సినిమా రేంజ్‌ ఏంటో..? సినిమా ఎలా ఉంటుందో తేలిపోయింది. మరీ ముఖ్యంగా మెగా బ్రదర్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ వాయిస్‌ ఓవర్ ఇవ్వడం పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను. కానీ, ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు..’ అంటూ పవన్ సింగిల్ డైలాగ్‌తో చింపేశాడు. పవర్ స్టార్ డైలాగ్‌తో ప్రారంభమై.. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ గంభీరమైన వాయిస్‌తో పవన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ మెగాభిమానులు, సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.

సెకండ్ డైలాగ్ సూపర్..!

ఆ తర్వాత ఓ ఆంగ్లేయుడు ఎవరీ నరసింహారెడ్డి..? ప్రశ్నించగా వచ్చే సెకండ్ డైలాగ్ సూపర్బ్ అనిపించింది. ‘సింహంలాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా..’ అంటూ నరసింహారెడ్డి ధీరత్వం గురించి వర్ణించేలా డైలాగ్ ఉంది.  ‘వేలాది వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ పవన్ వాయిస్ ఓవర్ తర్వాత చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే టీజర్ మాత్రం సూపర్బ్ అనిపించింది.

టీజర్ రివ్యూ..!

ఒక్క మెగాభిమానులే కాదు.. సినీ ప్రియులందర్నీ ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీజర్ మొత్తానికి పవన్ వాయిస్ ఓవర్ మాత్రం అదుర్స్ అనిపించింది. అంతేకాదు తెలుగోడి రోమాలు నిక్కపొడుచుకునేలా టీజర్ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో మరి.

కాగా.. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

 

More News

‘సైరా’కు ‘సేనాని’తో పాటు.. ఆ ఇద్దరు స్టార్లు మాటసాయం!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

‘సైరా’ టీజర్‌ రిలీజ్‌కు కౌంట్ డౌన్

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

కారు యాక్సిడెంట్... పరుగులు తీసిన హీరో రాజ్ తరుణ్

యువ హీరో రాజ్ తరుణ్‌కి పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగి అల్కాపూర్ వద్దనున్న ఔటర్ రింగురోడ్డులో

జస్ట్ కన్ఫూజన్.. తరుణ్ కాదు.. రాజ్‌తరుణ్!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, లవర్‌బాయ్‌గా పేరుగాంచిన తరుణ్‌‌‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని..

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

సీనియర్ బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) గుండెపోటు కారణంగా ముంబైలో కన్నుమూశారు.