close
Choose your channels

‘సైరా’ ట్రైలర్: ‘నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’

Wednesday, September 18, 2019 • తెలుగు Comments

‘సైరా’ ట్రైలర్: ‘నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్.. కెరియర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ ఈ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలుకుని ప్రొడక్షన్ వర్క్స్ అయిపోవడమే కాకుండా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్‌ని పూర్తిస్థాయిలో చిత్రబృందం మొదలుపెట్టేసింది. బుధవారం నాడు సైరా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నిజంగా ఈ ట్రైలర్‌ను సగటు భారతీయుడు, తెలుగోడు ‘సై.. సైరా’ అనాల్సిందే.

ఓహ్.. సైరా.. !

ఈ ట్రైలర్ ‘భారతమాతకి...జై’ అంటూ మొదలయ్యింది.‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అనే డైలాగ్ ఉంటే నిజంగా రక్తం పొంగిపోతుంది. ట్రైలర్ మొదట్నుంచి చివరి వరకూ అందరినీ కట్టిపడేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఒక్కటే కాదు.. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము.. మీకెందుకు కట్టాలిరా శిస్తు’,.. ‘స్వేచ్చ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’అంటూ చిరంజీవి పలికే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇలా అన్ని డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.

ట్రైలర్‌ రివ్యూ..!

భారతమాత స్వాతంత్య్రం గురించి పోరాడిన ఒక యోధుడి గురించి చెబుతున్నప్పుడు ఆ యోధుడి గురించి కాకుండా అతని ఆశయం గురించి చెప్పడం అనే సెన్సిబిల్ పాయింట్‌తో ట్రైలర్ కట్ చేసిన సురేందర్ రెడ్డి అక్కడే పూర్తిగా పాస్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. అదేదో సామెత ఉంది కదా.. ఒక్క మెతుకు చూసి అన్నం ఉడికిందా లేదా అని చెప్పొచ్చన్నది.. ఈ మూడు నిమిషాల ట్రైలర్ ఒక్కటి చాలు మూడు గంటల సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడానికి.. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు.

అందరూ ఓకే..!

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్ సూపర్‌గా ఉంది. గతంలో కొన్ని పోస్టర్స్ చూసి సినిమాలో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందా..? అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేవలం యోధుడు మాత్రమే కాదు.. ఒక యోగి అని చూపించిన విధానం ఈ సినిమాలో ఎంత డీటైలింగ్ వర్క్ ఉంది అనేదానికి చక్కటి ఉదాహరణ. ఇక ట్రైలర్‌ చిరుతో పాటు తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ఇలా అందరూ వారివారి డైలాగ్స్, ఆహార్యంతో ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు.

కేవలం గంట వ్యవధిలోనే..!

ఇదిలా ఉంటే.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ట్రైలర్ 76,274 వ్యూస్‌ను దక్కించుకుంది. అయితే ఈ ట్రైలర్‌పై 8,917 మంది వారి అభిప్రాయాలను వెల్లడించారు. ‘అతనొక యోగి.. అతనొక యోధుడు.. అతను కారణజన్ముడు.. అక్టోబర్ 2న రెడీగా ఉండండమ్మా.. కొణిదెల కొదమసింహం ఆన్ ది వే’ అంటూ మెగాభిమానులు, పలువురు సినీ ప్రియులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz