close
Choose your channels

సైరా ప్రిరీలీజ్ ఈవెంట్ వాయిదా..!?

Monday, September 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైరా ప్రిరీలీజ్ ఈవెంట్ వాయిదా..!?

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే తొలిసారిగా ‘సైరా’ అనే చారిత్రక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ మొదలుకుని ఇప్పటి వరకూ మెగాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా అక్టోబర్-02న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుండటంతో.. ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

ఈవెంట్ తేదీలో మార్పులు!

అయితే మొదట కర్నూలు‌లో ఈవెంట్‌ నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా వేడుకలు జరగనున్నాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న అనగా ఎల్లుండి ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన 18 నుంచి 22కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘అఖిలభారత చిరంజీవి యువత’ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇంతవరకూ దర్శకనిర్మాతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

కాగా.. ఈ మెగా వేడుకకు ప్రత్యేక అతిథులుగా తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శధీరుడు రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.