‘సైరా’ను వీళ్లు చూసేశారు.. ప్లస్, మైనస్‌లు ఇవే!

  • IndiaGlitz, [Saturday,September 28 2019]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టించిన చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్- 2న తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. సినిమా విడుద‌ల‌కు సమయం ద‌గ్గర‌పడుతున్న సంద‌ర్భంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది.

గూస్ బంప్సే..!

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను ‘హిందీ ఎగ్జిబిటర్స్’.. ‘సైరా’ సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా, టీవీ చానెల్స్ వేదికగా పంచుకున్నారు. ‘సైరా’ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు గూస్‌బంప్సే. సినిమాకోసం ప్రతి డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడింది. సినిమాలో ప్రతి సెక్టార్ చాలా బాగుంది. సినిమా మధ్యలో కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ.. క్లైమాక్స్ మాత్రం సూపర్బ్.. అదుర్స్’ అంటూ ఎగ్జిబిటర్స్ కితాబిచ్చేశారు. అంతేకాదు.. చిరంజీవి నటన మాటల్లో చెప్పలేనిది అని తమ మనసులోని మాటను వాళ్లు బయటపెట్టారు.

అన్నీ అదరగొట్టేశారు..!

వీఎఫ్ఎక్స్ అదరగొట్టేశారు.. నిజంగా ఇండియా సినిమాల్లో ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మాదిరిగా కాకుండా డబ్బు పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు స్పష్టమైంది. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకత్వం కూడా చాలా బాగుంది. మొత్తంమీద ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతమైన సినిమా. సైరా లాంటి సినిమాతో భారత్ గర్విస్తుంది.. ఇలాంటి సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేయాలి అని ఎగ్జిబిటర్స్ ఆకాంక్షించారు.

మొత్తానికి చూస్తే.. సినిమా మిడిల్‌ కాస్త బోరింగ్‌గా ఉండటమే మైనస్ పాయింట్ కాగా.. దాదాపు ఇక అన్నీ ప్లస్ పాయింట్సే ఉన్నాయి. హిందీ వరకు సైరా ఓకే.. మరి తెలుగులో పరిస్థితి ఎలా ఉంటుందో..? తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం నచ్చుతుందో తెలియాలంటే అక్టోబర్-03 వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

'గద్దల కొండ గణేష్' సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మెగా ఫ్యాన్స్ కి థాంక్స్ - వరుణ్‌ తేజ్‌

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'.

'దండుపాళ్యం' నవంబర్ 1న విడుదల

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’

'డబ్ స్మాష్' సాంగ్ విడుదల

వి.త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్ స్మాష్ సాంగ్ విడుదల సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది.

పాట చిత్రీక‌ర‌ణ‌లోనూ సైరా రికార్డ్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరు 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

హిట్ వెబ్‌సిరీస్ సీక్వెల్‌లో స‌మంత

అక్కినేని కోడలైన త‌ర్వాత స‌మంత అక్కినేని వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తుంది.