close
Choose your channels

మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా 'సైరా' షూటింగ్!

Tuesday, December 5, 2017 • తెలుగు Comments

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెంచర్ ఇది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహ‌మాన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రెహ‌మాన్‌ స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలో ఇంకా చిత్ర యూనిట్ నిర్ణయించుకోలేదు.

రేపటినుంచి (డిసెంబర్ 6, 2017) ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగ‌నుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ లేకుండానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందన్నమాట. ఇదిలా ఉంటే.. రేపటినుంచి ప్రారంభం కానున్న మొదటి షెడ్యూలుకి అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్.

సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదంటూ, అవుట్ పుట్ బాగుండాలని చిరు చెప్పినట్లు చిత్ర వర్గాల స‌మాచారం. ఫస్ట్ షెడ్యూలుని పది రోజుల పాటు చిత్రీకరించనున్నార‌ని తెలిసింది. ఆ పది రోజులు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'రంగస్థలం' సినిమాకి బ్రేక్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నారు. ఆ తర్వాత 'రంగస్థలం' సినిమాని పూర్తిచేసి.. ఈ సినిమాకి రెగ్యులర్ గా పనిచేయబోతున్నారని సమాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz