close
Choose your channels

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` ట్రైల‌ర్‌

Thursday, September 19, 2019 • తెలుగు Comments

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` ట్రైల‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో విడుద‌ల చేశారు. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌కారం ఈ సినిమా ట్రైల‌ర్‌కు అన్ని భాష‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 34 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కాయి. సెప్టెంబ‌ర్ 22న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఇందులో పాట‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

దాదాపు రూ.300కోట్ల బ‌డ్జెట్‌తో అత్త్యున్నత సాంకేతిక విలువ‌ల‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ఐదు భాష‌ల్లో గాంధీ జ‌యంతి.. అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫ్యాన్సీ ధ‌ర‌ల‌కే అమ్ముడ‌య్యాయి. ఇక శాటిలైట్ హ‌క్కులు రూ.125కోట్లు, డిజిట‌ల్ హ‌క్కుల‌కు రూ.40 కోట్లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా, నిహారిక‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించారు.

Get Breaking News Alerts From IndiaGlitz