సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` ట్రైల‌ర్‌

  • IndiaGlitz, [Thursday,September 19 2019]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో విడుద‌ల చేశారు. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌కారం ఈ సినిమా ట్రైల‌ర్‌కు అన్ని భాష‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 34 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కాయి. సెప్టెంబ‌ర్ 22న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఇందులో పాట‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

దాదాపు రూ.300కోట్ల బ‌డ్జెట్‌తో అత్త్యున్నత సాంకేతిక విలువ‌ల‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ఐదు భాష‌ల్లో గాంధీ జ‌యంతి.. అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫ్యాన్సీ ధ‌ర‌ల‌కే అమ్ముడ‌య్యాయి. ఇక శాటిలైట్ హ‌క్కులు రూ.125కోట్లు, డిజిట‌ల్ హ‌క్కుల‌కు రూ.40 కోట్లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా, నిహారిక‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించారు.

More News

‘రేవంత్’ మాస్టర్ ప్లాన్.. ఫెయిలైతే బీజేపీలోకి!?

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోందా..? పార్టీలు మారడానికి నేతలు అనవసర రాద్ధాంతాలన్నీ తెరపైకి తెస్తున్నారా..? అసలు ఉత్తమ్-రేవంత్‌రెడ్డిల గొడవ వెనుక అసలు కారణం మరొకటి ఉందా..?

ఎక్స్‌క్లూజివ్: బోటులో 73 కాదు 93 మంది ఉన్నారు!

తూర్పుగోదావరి జిల్లా పాపికొండల వద్ద ఘోర బోటు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలతో బయటపడగా.. మరికొందరు విగతజీవులై తేలారు. ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

చంద్రబాబు అత్యంత ఆప్తుడు, మాజీ ఎంపీ శివ ప్రసాద్ కు తీవ్ర అస్వస్థత!

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ మధ్యే కోలుకున్నారని కుటుంబ సభ్యులు మీడియా తెలిపారు.

కోడెల ఆత్మహత్య: బాంబ్ పేల్చిన తెలంగాణ మంత్రి!

టీడీపీ కీలక నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు..? ఆత్మహత్య వెనుక ఎవరున్నారు..?

నాగశౌర్య కొత్త చిత్రం

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నుంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో