చిరు బ‌ర్త్ డేకి 'సైరా' ట్రైల‌ర్‌

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

తొలిత‌రం స్వాతంత్ర్య‌స‌మ‌ర‌యోధుడు, పాలెగాడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో రూపొందుతున్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. 'నువ్వు చారిత్ర‌క దుస్తుల్లో 'మ‌గ‌ధీర‌'లో కనిపించావు. నా కెరీర్‌లో అలాంటి చిత్ర‌మే లేదు' అని త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో చిరంజీవి అన్న మాట‌ల‌కు ప్ర‌తిఫ‌ల‌మే ఇప్పుడు తెర‌కెక్కుతున్న 'సైరా'. తండ్రి మ‌న‌సులో ఉన్న కోరిక‌ను తీర్చ‌డానికి త‌న‌యుడు స్వ‌యంగా న‌డుంబిగించి లావిష్‌గా తెర‌కెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి చ‌ర‌ణ్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ మేర‌కు చిత్రానికి సంబంధించిన ప‌నుల‌న్నిటినీ శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. 

అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో గురువు పాత్ర పోషిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, నీహారిక కొణిదెల‌... ఒక్క‌రా ఇద్ద‌రా... ఇండ‌స్ట్రీలో ఉన్న న‌టీన‌టులంద‌రూ 'సైరా'లో క‌నిపిస్తార‌నే స్థాయిలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమా ఎలా ఉండ‌బోతోందో ఉప్పు చూపించేది ట్రైల‌ర్‌. ఈ ట్రైల‌ర్‌ను ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ట్రైల‌ర్ ఎలా ఉండాల‌నే విష‌య‌మై ఇప్ప‌టికే యూనిట్ ముఖ్యులు భేటీ వేసుకున్నార‌ట‌. ప‌ర్ఫెక్ట్ సీజీ, ఆర్‌.ఆర్‌తో ట్రైల‌ర్ అదిరిపోయేలా ఉండాల‌ని కొణిదెల సురేఖ సైతం కోరుకుంటున్నార‌ట‌. త‌ల్లిదండ్రుల కోరిక‌ను నెర‌వేర్చే ప‌నిలో ఉన్నారు నిర్మాత చ‌ర‌ణ్‌.

More News

మ‌ళ్లీ సైన్ చేసిన అమ‌ల‌

అమ‌ల తాజాగా మ‌రో సినిమాకు సైన్ చేశారు. అంత‌ర్జాతీయంగా పాకుతున్న ఓ

జులై 5 న విడుదల కానున్న 'కెఎస్100' చిత్రం..!!

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం "కెఎస్100"..

తెలంగాణలో ట్రంప్ విగ్రహం.. ఆశ్చర్యపోయిన జనం

అవును మీరు వింటున్నది నిజమే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విగ్రహం తెలంగాణలో వెలిసింది. ఇదేంటి..

అంతా తూచ్ అంటున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈయ‌న కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించే సినిమా

'ఆర్ ఆర్ ఆర్' ఫ‌స్ట్ లుక్‌కు ముహూర్తం కుదిరిందా?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `RRR`.