స్పై క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదు - తాప్సీ

  • IndiaGlitz, [Thursday,March 30 2017]

తాప్పీ, అక్ష‌య్‌కుమార్‌, మ‌నోజ్ బాజ్‌పేయి, పృథ్వీరాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం 'నామ్ ష‌బానా'.శివ‌మ్ నాయర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

దర్శ‌కుడు శివ‌మ్ నాయ‌ర్ మాట్లాడుతూ - ''ష‌భానా అనే అమ్మాయి క‌థే ఈ చిత్రం. ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి స్పైగా ఎలా మారింద‌నేదే క‌థ‌. బేబి సినిమా చూసిన త‌ర్వాత ఆ సినిమా ద‌ర్శ‌కుడు నీర‌జ్‌పాండేగారిని క‌లిసి ఈ క్యారెక్ట‌ర్ గురించి చెప్పాను. ష‌బానా అనే అమ్మాయికి ఒక బ్యాక్‌డ్రాప్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని ఆయ‌న‌కు విడ‌మ‌రిచి చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది'' అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ - ''బేబి సినిమా విడుద‌లై, అందులో నా పాత్ర‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఓ రోజు నీర‌జ్ పాండేగారు ఫోన్ చేసి, ష‌బానా క‌థ గురించి చెప్పి, నీకు ఓకేనా అని అడిగారు. నేను చేయ‌డానికి సిద్ధ‌మే..మీకు ఓకేనా అని అడిగాను. ఎందుకంటే బేబి సినిమాలో నాది ప‌దిహేను నిమిషాల ముఖ్య‌మైన పాత్ర‌. ఆ పాత్ర‌ను ప్ర‌ధానంగా చేసుకుని పూర్తిస్థాయి సినిమా చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. రీసెంట్‌గా సినిమాను పూర్తిగా చూసిన త‌ర్వాత థ్రిల్‌గా ఫీల‌య్యాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. ఒక హీరోయిన్, హీరో స్థానంలో ఉండి సినిమాను ముందుకు న‌డిపించ‌డం గొప్ప విష‌యం. రానా ఈ చిత్రంలో న‌టించ‌లేదు. రానా త‌ప్ప బేబి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు.

ఇది ప్రీక్వెల్ కాదు. ఒక క్యారెక్ట‌ర్ గురించి, డెప్త్‌గా చేసిన ఈ సినిమా స్పినాఫ్ అంటారు. మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి స్పైగా ఎలా మారింద‌నేదే క‌థ‌. ఇండియన్ సినిమాలో ఇలాంటి క‌థ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్ ట్ర‌యినింగ్ తీసుకున్నాను. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా క్లిష్టం. చ‌ష్మే బ‌ద్దూర్ లో కామెడి రోల్‌, పింక్‌లో సీరియ‌స్ డ్రామా రోల్ చేశాను. ఈ సినిమ‌లోస్పై క్యారెక్ట‌ర్ చేశాను. జుడువా అనే సినిమాలో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తాను. ష‌బానా క్యారెక్ట‌ర్ షార్ట్ టెంప‌ర్‌, ఎగ్రెసివ్ క్యారెక్ట‌ర్‌. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి నేను డైరక్ట‌ర్‌ను న‌మ్మి చేస్తాను. తెలుగులో పాఠ‌శాల ద‌ర్శ‌కుడు మ‌హి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను''అన్నారు.

More News

'రక్షకభటుడు' ..స్టైలిష్ థ్రిల్లింగ్ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ - వంశీకృష్ణ ఆకెళ్ళ

రక్ష,జక్కన్న వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు తర్వాత దర్శకుడు వంశీక ష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ బ్యానర్పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షకభటుడు'.

వైభవంగా కళాసుధ 19వ ఉగాది పురస్కారాల వేడుక

శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉగాది సందర్బంగా అందిస్తున్న సినిమా అవార్డుల వేడుక చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో ఘనంగా జరిగింది.

ఆయన ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ సినిమా అసలు ఉండేదే కాదు - సుధ కొంగర

సుధ కొంగర పేరు వినగానే సాలా ఖద్దూస్,ఇరుదు సుట్రు సినిమాలు గుర్తుకొస్తాయి.'హీరో వెంకటేశ్ తొలిసారి ఓ మహిళ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

జగపతిబాబు టైటిల్ పాత్రలో వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నెం.11 'పటేల్' ప్రారంభం!!

జగపతిబాబు టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "పటేల్". "ఎస్.ఐ.ఆర్" అనేది ట్యాగ్ లైన్. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ ముగ్గురిలో ఎవరబ్బా?

ప్రభాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. బాహుబలి సీక్వెల్ రిలీజ్ ఒక వైపు, నెక్స్ట్ సినిమా ప్రారంభోత్సవం ఒకవైపు.. ప్రభాస్ హెక్టిక్ షెడ్యూల్తో గడుపుతున్నారు. రన్రాజా రన్ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.