close
Choose your channels

తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

Wednesday, October 10, 2018 • తెలుగు Comments

Taapsee new film titled Game Over

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత `బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2` చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో ఓ సినిమాలో న‌టిస్తుంది తాప్సీ.

రిలయ‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అసోసియేష‌న్‌తో గురు, శ‌శికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `గేమ్ ఓవ‌ర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. వీల్ చెయిర్‌లో తాప్సీ కూర్చున్న ఫోటోను రిలీజ్ చేశారు. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో సినిమా తెర‌కెక్కింది.

ఇంతకు ముందు న‌య‌న‌తార‌తో `మ‌యూరి` అనే సినిమాను డైరెక్ట్ చేసిన అశ్విన్ శ‌ర‌వ‌ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రేప‌టి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz