close
Choose your channels

'పందెంకోడి 2' అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది - సమర్పకులు ఠాగూర్‌ మధు

Monday, October 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పందెంకోడి 2 అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది - సమర్పకులు ఠాగూర్‌ మధు

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిర్మాత ఠాగూర్‌ మధుతో జరిపిన ఇంటర్వ్యూ ....

ఇది పర్‌ఫెక్ట్‌ సీక్వెలా? లేక పందెంకోడిలోని పాత్రల ఆధారంగా 'పందెంకోడి 2' తెరకెక్కించారా?

ఇది పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌. మొదటి భాగంలోని క్యారెక్టర్స్‌ ఆధారంగానే ఈ సినిమా ట్రీట్‌మెంట్‌ రాయడం జరిగింది. పందెంకోడిలోని ఎమోషన్‌ ఈ సినిమాలో కూడా క్యారీ అవుతుంది.

ఈ సినిమాని తీసుకోవడం వెనుక ప్రత్యేకమైన రీజన్‌ ఉందా?

నేను 'పందెంకోడి' సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలోని హీరో క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది. సాధారణంగా ఏ సినిమాలోనైనా విలన్‌ కంటే హీరో చిన్నవాడై ఉంటాడు. కానీ ఈ సినిమాలో హీరో కంటే విలన్‌ పెద్దవాడు. చాలామందిలో ఈ పాయింట్‌ వర్కవుట్‌ అవుతుందా డౌట్‌ ఉండేది. సినిమా రిజల్ట్‌ చూసిన తర్వాత పందెంకోడి చిత్రంపై ఇంట్రెస్ట్‌ చూపించారు.

డైరెక్టర్‌ లింగుస్వామి గురించి?

'పందెంకోడి' సినిమా కంటే 'పందెంకోడి 2'ని లింగుస్వామిగారు బాగా డీల్‌ చేశారు. అతని కెరీర్‌లో ఈ సినిమాకి ది బెస్ట్‌ అనిపించేంతగా వర్క్‌ చేశారు. ప్రతి క్యారెక్టర్‌ని చాలా డెప్త్‌గా డిజైన్‌ చేశారు. స్క్రిప్ట్‌ పరంగా 'పందెంకోడి 2' చిత్రం 'పందెంకోడి' కంటే చాలా బెటర్‌గా ఉంటుంది. కథను చిన్న సంఘటన రూపంలో చెప్పుకుంటే.. ఎన్నో ఏళ్ల నుండి రెండు ఊళ్ళ మధ్య పరిష్కారం దొరకని ఓ ప్రోబ్లమ్‌ ని.. హీరో ఎలా సాల్వ్‌ చేసాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంది?

'పందెంకోడి' సినిమా విశాల్‌కి చాలా ఎమోషనల్‌ ఫిల్మ్‌. పర్సనల్‌గా చాలా బాగా కనెక్ట్‌ అయిన ఫిల్మ్‌. సీక్వెల్‌ స్టార్ట్‌ అవ్వకముందు నుంచే ఈ సినిమాపై తనకి ఒక ప్రత్యేకమైన ఇంట్రస్ట్‌ ఉంది. అందుకే మనసు పెట్టి ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ కూడా చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్‌ కూడా డైరెక్టర్‌ చాలా బాగా డిజైన్‌ చేశారు. ఎవ్వరికీ భయపడకుండా, ఎప్పుడూ అల్లరి చేసే అమ్మాయి. తను చేసే పనులు, చెప్పే సమాధానాలు కూడా ఆసక్తి కలిగించేలా ఉంటాయి.

ఈ సినిమాలో వరలక్ష్మీ చేసిన క్యారెక్టర్‌ చాలా కీలకమైంది. ఆ పాత్రకు ఆమె ఎంత వరకు న్యాయం చేశారు?

ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. తను ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసింది. తెలుగు అర్ధం చేసుకొని మరీ తన పాత్రకి తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. అప్పటికే మేము చాలామంది డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లను ట్రై చేశాము. ఎవరు చెప్పినా ఆ పాత్ర తాలూకు గాంభీర్యం, ఎమోషన్‌ రావట్లేదు. చివరకి తను డబ్బింగ్‌ చెప్పాక ఆ పాత్ర సినిమాలో బాగా ఎలివేట్‌ అయింది.

ఎన్టీఆర్‌ 'టెంపర్‌'ని తమిళ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. మార్పులు ఏమైనా చేశారా? సినిమా ఎలా వస్తోంది?

పెద్దగా మార్పులేమీ చెయ్యలేదు. కాకపొతే తమిళ్‌ నేటివిటీకి తగిన విధంగా అక్కడక్కడ రెండు మూడు సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చెయ్యటం జరిగింది. సినిమా చాలా బాగా వస్తోంది. తెలుగులోలాగే తమిళంలో కూడా టెంపర్‌ రీమేక్‌ సూపర్‌హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను.

'పందెంకోడి 2' చూశారా? మీకేమనిపించింది?

మొన్నే మా టీమ్‌తో కలిసి చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా 'పందెంకోడి 2'. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత ఠాగూర్‌ మధు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.