ఇలాంటి వ్యక్తి ఒక్కరుంటే చాలు దేశానికి ఎంతో మేలు: మంత్రి తలసాని

  • IndiaGlitz, [Wednesday,April 26 2017]

క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ను ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వ‌రిడంచ‌డంతో యావ‌త్త్ టాలీవుడ్ ఇండ‌స్ర్టీ అంతా అభినంద‌న‌ల జ‌ల్లు కురిపిస్తోంది. కాగా ఈరోజు ( బుధ‌వారం) మ‌ధ్నాహ్నం తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌ యాద‌వ్, మా అధ్య‌క్షుడు శివాజీ రాజా, జాయింట్ సెక్ర‌ట‌రీ న‌రేష్ స్వ‌యంగా విశ్వ‌నాథ్ ఇంటికెళ్లి అభినందించారు.
అనంత‌రం త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ, ' ఇప్ప‌టివ‌ర‌కూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మ‌న తెలుగు వాళ్లైన బి.ఎన్. రెడ్డి, పైడి జైరాజు, ఎన్. వి. ప్ర‌సాద్ , నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, రామానాయుడు గారికి అందించారు. ఇప్పుడు విశ్వ‌నాథ్ గారిని ఆ అవార్డుతో స‌త్క‌రించ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఎన్నో్ సందేశాత్మ‌క సినిమాలు తెర‌కెక్కించారు. 'స్వ‌ర్ణ‌క‌మలం' తో పాటు చిరంజీవి గారితో ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈ అవార్డు ఆయ‌న్ను ఎప్పుడో వ‌రించాలి. కానీ ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ మంచి నిర్ణ‌యంతో ఆయ‌న్ను గౌర‌వించ‌డం తో ప్ర‌పంచంలో ఉన్న తెలుగు వాళ్లు అంతా గౌర‌వంగా భావిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు ఆయ‌న్ను స‌న్మానం చేయ‌మ‌ని చెప్పారు. ఆయ‌న్ను గౌర‌వించ‌డం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి వ్య‌క్తులు స‌మాజంలో ఒక్క‌రుంటే చాలు దేశానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం త‌రుపున కూడా ఓ కార్య‌క్ర‌మం చేస్తాం. ప్ర‌స్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగిపోతుంది. ఈ సంవ‌త్స‌రం కూడా ఇండ‌స్ర్టీకి మంచి బ్రేక్ వ‌చ్చింది' అని అన్నారు.
'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ' విశ్వ‌నాథ్ గారు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ అంతా గ‌ర్వంగా చెప్పుకునే ఎన్నో సినిమాలు చేశారు. ఇది మాకు దక్కిన గౌర‌వం. ఈ టైమ్ ఆ టైమ్ లో అవార్డు రావ‌డం ఇది సంజీవ‌ని లాంటింది. మేమంతా సంబురాలు చేసుకుంటున్నాం. త్వ‌ర‌లోనే మా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక చేస్తున్నాం. ఆ వేడుక‌లో ఆయ‌న్ను అత్యంగ గౌరవంగా స‌త్క‌రించుకుంటాం' అని అన్నారు.
'మా' జాయింట్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, ' 'మాయాబ‌జార్', 'శంక‌రాభ‌ర‌ణం, నుంచి ఇప్ప‌టి బాహుబ‌లి వ‌ర‌కూ భార‌త‌దేశంలో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు తీయ‌డం జ‌రిగింది. కె. విరెడ్డి, కె. విశ్వ‌నాథ్ , రాజ‌మౌళి ప్ర‌పంచానికి తెలుగు సినిమాను చాటి చెప్పారు. విశ్వ‌నాథ్ గారు చేసిన ఎన్నో సినిమాలు తెలుగు జాతి గౌర‌వాన్ని నిల‌బెట్టాయి. క‌మిటీ మొత్తం విశ్వ‌నాథ్ గారిని ఏక‌గ్రీవంగా అవార్డుకు ఎంపిక చేయ‌డం ఎంతో గొప్ప విష‌యం. ఆయ‌న‌ మ‌రిన్ని ప్ర‌పంచ స్థాయి అవార్డులు అందుకోవాల‌ని కోరుకుంటున్నాం' అని అన్నారు

More News

'పిశాచి 2' సక్సెస్ మీట్

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'పిశాచి-2'.

విశ్వనాథ్ చిత్రాలు ఆణిముత్యాలు: పవన్ కళ్యాణ్

కళాత పస్పి కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడం పట్ల తెలుగు ఇండస్ట్రీ అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.

స్లొవేనియా వెళ్తున్న గంటా రవి, జయంత్ సి. పరాన్జీల 'జయదేవ్'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ 'నక్షత్రం'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో 'బుట్ట బొమ్మ క్రియేషన్స్ ' పతాకంపై

ప్రేమమ్ హీరోయిన్ స్థానంలో అమైరా...

బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తర్ తెలుగు సినిమాలో నటించనుంది.