త‌మ‌న్నా, ఓంకార్ కాంబినేష‌న్‌లో లాంఛనంగా ప్రారంభమైన 'రాజుగారిగ‌ది 3'

  • IndiaGlitz, [Thursday,June 20 2019]

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం 'రాజుగారిగ‌ది' ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాకు ఫ్రాంచైజీగా 'రాజుగారి గ‌ది 3' గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 'రాజుగారిగ‌ది 3'లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

శుక్ర‌వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌, గౌతంరాజు ఎడిటింగ్‌, సాహి సురేశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

More News

ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఊహించని ఘటన!

ఢిల్లీ వేదికగా బుధవారం నాడు అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఓ ఆసక్తికర, ఊహించని సన్నివేశం జరిగింది.

లుక్ మార్చిన పవన్.. కొత్త సినిమా కోసమేనా!?

జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీచేసినప్పటికీ.. ఈ రెండు స్థానాల్లోనూ వైసీపీ విజయకేతనం ఎగరేసింది.

అది హిట్ అయితే... శ్రుతి గ్లోబ‌ల్ స్టారే

ఏ ప్రాజెక్ట్ ఎవ‌రిని ఏ అంద‌లాలు ఎక్కిస్తుందో తెలియ‌దు. కొన్నిసార్లు అదృష్టం హ‌ఠాత్తుగా త‌లుపు త‌డుతుంది.

రానా ‘విరాటపర్వం’ స్టోరీ లీక్ అయిందా ?

దగ్గుబాటి రానా, సాయి పల్లవి నటీనటులుగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభమైంది.

పెద్ద బ్యానర్లో అర్జున్ రెడ్డి భామ

అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే కొత్త‌గా తెలుగులో ఓ సినిమాకు సంత‌కం చేశార‌ని వినికిడి. అందులో ఆమె అడ్వ‌కేట్ పాత్ర పోషించ‌నున్నారు.