త‌మ‌న్నా.. వ‌రుస‌గా మూడో ఏడాది

  • IndiaGlitz, [Friday,May 25 2018]

తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సులకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వేరేగా చెప్పనక్కరలేదు. ఈ విష‌యంలో హీరోల‌దే హ‌వా. అయితే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో సమానంగా స్టెప్స్ వేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం.. ఠ‌క్కున‌ తమన్నా పేరు వినబడుతుంది. క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చిన తొమ్మిదేళ్ళ త‌రువాత‌.. తొలిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ (2014) సినిమా కోసం ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించిందీ మిల్కీ బ్యూటీ. ఆ త‌రువాత వెంట‌నే ఐటెం సాంగ్స్ చేయ‌క‌పోయినా.. అడ‌పాద‌డ‌పా ఆ వైపు అడుగులు వేస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం నాలుగు ఐటెం సాంగ్స్ చేసిన త‌మ‌న్నా.. తాజాగా నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ చేయ‌డానికి అంగీక‌రించింది. 25 ఏళ్ళ క్రితం విడుద‌లైన 'అల్ల‌రి అల్లుడు' చిత్రంలోని 'నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తు' అనే పాట తాలుకు రీమిక్స్‌లో ఈ మిల్కీ బ్యూటీ మెర‌వ‌నుంది. విశేష‌మేమిటంటే.. గ‌త‌ రెండు సంవత్సరాల్లోనూ ప్ర‌త్యేక గీతాలు చేసిన త‌మ‌న్నాకి ఐటెం గ‌ర్ల్‌గా వ‌రుస‌గా ఇది మూడో ఏడాది కావ‌డం విశేషం.

2016లో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ హీరోగా రూపొందిన ‘స్పీడున్నోడు’ చిత్రంతో పాటు 'జాగ్వార్' అనే క‌న్న‌డ చిత్రంలోనూ త‌న డ్యాన్సుల‌తో అల‌రించిన త‌మ‌న్నా.. గత ఏడాది (2017) యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’లోని ప్ర‌త్యేక గీతం కోసం న‌ర్తించి ప్రేక్షకులకి కనువిందు చేసింది. మొత్తానికి.. వ‌రుస‌గా మూడేళ్ళ‌పాటు త‌మ‌న్నా ఐటెం గ‌ర్ల్‌గా సంద‌డి చేస్తుంద‌న్న‌మాట‌.

More News

జూన్ 22న 'టిక్ టిక్ టిక్'

బిచ్చగాడు, 16 చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్ లొ ప్రత్యేక గుర్తింపు ను సంపాందించారు.

జూన్ 1న విడుద‌ల‌వుతోన్న 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి'

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం 'ఒరు ముగ తిరై'. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి' పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' ప్రీ రిలీజ్ వేడుక‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హ నిర్మాత‌గా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'.

జూన్ 1న రాజ్ తరుణ్ 'రాజు గాడు' విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ 'రాజుగాడు' చిత్రం జూన్1న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మరియు చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది.

సంజ‌య్ ద‌త్ హీరోగా బాలీవుడ్ ప్ర‌స్థానం..

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ ప్ర‌స్థానం హిందీ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఒరిజిన‌ల్ ను తెర‌కెక్కించిన దేవాక‌ట్టానే హిందీలోనూ ద‌ర్శ‌కుడు.