ఒక్క‌డొచ్చాడు డైరెక్ట‌ర్ సూర‌జ్ పై ఫైర్ అయిన‌ తమన్నా

  • IndiaGlitz, [Monday,December 26 2016]

విశాల్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ఒక్కడోచ్చాడు. ఈ చిత్రాన్నిసూర‌జ్ తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. డైరెక్ట‌ర్ సూర‌జ్ హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే... ఒక్కడోచ్చాడు ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో తమన్నా షార్ట్ డ్రెస్సెస్ & స్కిన్ షో పై సూర‌జ్ ని అడిగితే...హీరోయిన్స్ కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు. మాస్ ఆడియోన్స్ హీరోయిన్స్ గ్లామ‌ర్ కోసం థియేట‌ర్స్ కి వ‌స్తుంటారు. అందుచేత హీరోయిన్స్ స్కిన్ షో చేసి తీరాలి. నేనైతే కాస్ట్యూమ్ డిజైన‌ర్ మోకాలి కింది వ‌ర‌కు డ్రెస్ తీసుకు వ‌స్తే క‌ట్ చేయ‌మ‌ని చెబుతాను.

ఏక్టింగ్ స్కిల్స్ చూపించాలి అంటే సీరియ‌ల్స్ లో చూపించ‌వ‌చ్చు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అయితే స్కిన్ షో చేయాల్సిందే అన్నారు.సూరజ్ కామెంట్స్ పై న‌య‌న‌తార ఫ‌స్ట్ ఫైర్ అయ్యారు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు పాత్ర‌కు తగ్గ‌ట్టే స్కిన్ షో చేసాను. ఆడియోన్స్ కు సూర‌జ్ కంటే మంచి టేస్ట్ ఉంది. హీరోయిన్స్ గ్లామ‌ర్ కోసం థియేట‌ర్స్ కి రావడం లేదు అంటూ త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేసింది. ఆత‌ర్వాత మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సూరజ్ పై ఫైర్ అయ్యింది. మ‌నం 2016లో ఉన్నాం. పింక్, దంగ‌ల్ త‌ర‌హా సినిమాలు వ‌స్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో సూర‌జ్ ఇలా మాట్లాడ‌డం చాలా బాదాక‌రం. సూర‌జ్ ఖ‌చ్చితంగా క్ష‌మ‌ప‌ణ‌లు చెప్పాల్సిందే. మేము ఆడియోన్స్ ను ఎంట‌ర్ టైన్ చేయాలి అనుకుంటాం. మ‌మ్మ‌ల్ని వ‌స్తువుల్లా చూడ‌కండి అంటూ సూరజ్ పై ఫైర్ అయ్యింది మిల్కీబ్యూటీ..!

More News

భారీ రేటుకు ఖైదీ నెం 150 శాటిలైట్ రైట్స్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.  చాలా గ్యాప్ త‌రువాత చిరు న‌టిస్తుండ‌డంతో సినిమా ప్రారంభం నుండి ఖైదీ నెం 150 పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

తలైవా మొదలెట్టేశాడు

తలైవా రజనీకాంత్ డబ్బింగ్ మొదలుపెట్టేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో రూపొందిన `రోబో` చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం `2.0`.

ఖైదీ నెం 150 థ‌ర్డ్ సాంగ్ యు & మి వ‌చ్చేస్తుంది..!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ భారీ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు.

ద‌ర్శ‌కుడిగా అల్ల‌రి న‌రేష్ - ముహుర్తం ఖ‌రారు..!

అల్ల‌రి న‌రేష్ న‌టించిన తాజా చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించిన ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

వంగవీటి రాధా కి రామ్ గోపాల్ వర్మ బ్లాస్ట్ వార్నింగ్

రంగాగారి క్యారెక్టర్ని వక్రీకరించానన్నా రాధా కామెంట్లకి నా సమాధానం