తమన్నా మళ్లీ బిజీ

  • IndiaGlitz, [Saturday,September 09 2017]

శ్రీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నాకు, హ్యాపీడేస్‌తో హీరోయిన్‌గా బ్రేక్ వ‌చ్చింది. స్టార్ హీరోలంద‌రితో వ‌రుస బెట్టి సినిమాల‌ను చేసింది. త‌మ‌న్నా కెరీర్‌ని ప‌రిశీలిస్తే.. అప్ అండ్ డౌన్‌లు బాగానే ఉన్నాయనిపిస్తుంది. అయిన‌ప్ప‌టికీ బ్యాలెన్స్‌డ్‌గా కెరీర్‌ని మ‌ల‌చుకుంటోంది ఈ ముద్దుగుమ్మ‌. త‌మ‌న్నా చేతిలో సినిమాలు లేవు అని అంద‌రూ మాట్లాడుకునే టైమ్‌కి.. ఆస‌క్తిక‌ర‌మైన ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలోకి వ‌స్తూనే ఉంటాయి.ఒక నెల క్రితం వ‌ర‌కు త‌మ‌న్నాకి తెలుగులో సినిమాలు లేవు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మూడు సినిమాలు ఆమె ఖాతాలో చేరాయి. క‌ళ్యాణ్ రామ్‌కి జంట‌గా ఓ సినిమా.. జైల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్‌తో ప్ర‌త్యేక గీతం.. తాజాగా క్వీన్ రీమేక్‌.. ఇలా మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి ఆమెకి. ఆల్రెడీ సందీప్ కిష‌న్‌తో క‌లిసి న‌టిస్తున్న సినిమా ఉండ‌నే ఉంది. దీంతో త‌మ‌న్నా తెలుగులో మ‌ళ్లీ బిజీగా మారిన‌ట్ల‌య్యింది. మ‌రోవైపు విక్ర‌మ్‌తో స్కెచ్ అనే త‌మిళ సినిమా చేస్తోంది ఈ మిల్కీ బ్యూటీ.