తమన్నా ఏ మాత్రం తగ్గట్టేదు

  • IndiaGlitz, [Sunday,October 04 2015]

'బాహుబ‌లి' విజ‌యంతో త‌మ‌న్నా క్రేజ్ మ‌రింత పెరిగింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని త‌మ‌న్నాని అప్‌క‌మింగ్‌ సినిమాల్లో గ్లామ‌ర్ ప‌రంగా బాగానే వాడుకుంటున్నారు ఫిల్మ్ మేక‌ర్స్‌. త‌మ‌న్నా కూడా 'గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న' విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. తాజాగా విడుద‌లైన 'బెంగాల్ టైగ‌ర్' పోస్ట‌ర్ చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మౌతుంది.

ఈత‌రం అగ్ర‌ క‌థానాయ‌కులంద‌రితోనూ ఆడిపాడిన ఘ‌న‌త‌ను ఈ సినిమాతో మిల్కీ బ్యూటీ పూర్తిచేసుకోబోతోంది. అందుకే ఈ సినిమా కోసం ష‌రామాములుగానే స్కిన్ షోకి ఏ మాత్రం అభ్యంత‌రం చెప్ప‌కుండా హోయ‌లు పోతోంది త‌మ‌న్నా. 'బెంగాల్ టైగ‌ర్' లో రాశి ఖ‌న్నా మ‌రో నాయిక‌గా న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. ఆడియ‌న్స్ కాన్‌స‌న్‌ట్రేష‌న్ మొత్తం త‌న‌పైనే ఉండాల‌న్న‌ట్లుగా త‌మ‌న్నా తీసుకుంటున్న శ్ర‌ద్ధ సినిమాకి బాగానే హెల్ప్ అయ్యేలానే క‌నిపిస్తోందంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలా ఉంటే.. 'బెంగాల్ టైగ‌ర్' ఆడియోను ఈ నెల 18న‌, సినిమాని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

నిన్న గోపీచంద్... నేడు అజిత్..

కెమెరామేన్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన 'శౌర్యం'శివ..ప్రస్తుతం తమిళంలో అజిత్ తో 'వేదాళం'అనే సినిమా రూపొందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపై సేవా కార్యక్రమాలకు సగం సమయం కేటాయిస్తా - ఆదిత్యా ఓం

జయాపజయాలకు అతీతంగా నటుడిగా గుర్తించి ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి తనవంతు సేవలందించే లక్ష్యంతో ఇకపై సగం సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్టు నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం తెలిపారు.

'సోగ్గాడే చిన్నినాయనా' షూటింగ్ పూర్తి

కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్'సోగ్గాడే చిన్నినాయనా'.

వెంకీ ప్లేస్ లో నాగ్...?

విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల,ద్రుశ్యం చిత్రాల తర్వాత రెండు..మూడు సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ సెట్స్ పై వెళ్లలేదు.

షేర్ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఇదే...

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం షేర్.ఈ చిత్రానికి మల్లిఖార్జున్ దర్శకత్వం వహించారు.కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.