close
Choose your channels

బిగ్‌బాస్ నుండి తమన్నా ఔట్

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ నుండి తమన్నా ఔట్

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 మూడోవారం ఎలిమినేషన్ ముగిసింది. అందరూ ఊహించిన విధంగానే తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి వారం హేమ ఎలిమినేట్ కాగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ లిస్ట్‌లో పునర్నవి, బాబామాస్టర్, వితిక, తమన్నా సింహాద్రి నిలిచారు. షోకి స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన వెన్నెలకిషోర్ పునర్నవిని సేవ్ చేశారు. మరోసారి బాబా మాస్టర్‌ని సేవ్ చేశారు. చివరగా వితికను సేవ్ చేశారు. తమన్నా ఎలిమినేషన్ తర్వాత నవ్వుకుంటూ బయటకు వచ్చేశారు. అందరినీ పలకరించినా.. రవిని మాత్రం పలకరించలేదు. బాబా భాస్కర్ మాస్టర్ తనకెంతో సపోర్ట్ చేశారని ఆమె ఎమోషనల్‌గా మాట్లాడారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.