close
Choose your channels

త‌మ‌న్నా స్పెష‌ల్‌...

Sunday, August 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మ‌న్నా స్పెష‌ల్‌...

ఒక‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్‌లో.. ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ప్ర‌త్యేక న‌టీమ‌ణులుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్‌, టాలీవుడ్ స‌హా అన్ని ఇండ‌స్ట్రీల్లో స్టార్ హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఈ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి అంద‌రూ హీరోయిన్స్ కాకుండా కొంద‌రు హీరో్యిన్స్‌ను మాత్ర‌మే నిర్మాత‌లు అప్రోచ్ అవుతుంటారు.

అందుకోసం స‌ద‌రు నిర్మాత‌లు ఆ హీరోయిన్స్‌కు భారీ మొత్తాన్నే రెమ్యున‌రేష‌న్స్‌గా ఇస్తుంటారు. అలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేసే కేట‌గిరి హీరోయిన్స్‌లో త‌మ‌న్నా ఒక‌టి. అ్ల‌లుడు శీను, జాగ్వార్‌, జై ల‌వ‌కుశ చిత్రాల్లో త‌మ‌న్నా స్పెష‌ల్ నెంబ‌ర్స్‌లో న‌ర్తించి అల‌రించింది. తాజాగా ఓ కన్న‌డ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి త‌మ‌న్నా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. క‌న్న‌డ చిత్రం `కె.జి.ఎఫ్‌`లో త‌మ‌న్నా ఈ సాంగ్ చేయ‌నుంది. య‌ష్‌, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.