సాయిప‌ల్ల‌విని ఫాలో అయిన మిల్కీ బ్యూటీ

  • IndiaGlitz, [Tuesday,March 31 2020]

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు అవుతుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సాయిప‌ల్ల‌విని ఫాలో అయ్యిందా? అంటే అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఇంత‌కూ సాయిప‌ల్ల‌విని త‌మ‌న్నా ఏ విష‌యంలో ఫాలో అయ్యిందో తెలుసా? వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం త‌మ‌న్నాభాటియా గోపీచంద్ జోడీగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సీటీమార్ అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాలో త‌మ‌న్నా తెలంగాణ క‌బ‌డ్డీ కోచ్‌గా క‌న‌ప‌డ‌నుంది. హీరో గోపీచంద్ ఆంధ్ర క‌బ‌డ్డీ కోచ్‌గా క‌న‌ప‌డ‌నుంది.

ఈ పాత్ర కోసం త‌మ‌న్నా తెలంగాణ నేర్చుకుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ఏదో ఆషామాషీగా కాకుండా ప‌క్కా తెలంగాణ పోరిలా క‌న‌ప‌డటానికి త‌మ‌న్నా బాగా శ్ర‌మ ప‌డింద‌ట‌. తెలంగాణ యాస‌ను మాట్లాడ‌టానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యింద‌ట‌. ఇదే త‌ర‌హాలో త‌మిళ పొన్ను సాయి ప‌ల్ల‌వి కూడా ఫిదా సినిమా కోసం తెలంగాణ యాస‌ను నేర్చుకుంది. ఆ సినిమాలో సాయి ప‌ల్ల‌వి మాట్లాడే యాస చూస్తే ఆమెను తెలంగాణ అమ్మాయి అనుకునేంత బాగా న‌టించింది. ఇప్పుడు మ‌రి త‌మ‌న్నా కూడా ప్రేక్ష‌కుల‌ను అంత‌లా మెప్పిస్తుందో లేదో చూడాలి.