త‌మ‌న్నా కోరిక నెర‌వేరిన‌ట్టే

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

పేరుకి ఉత్తరాది భామ అయినా.. ద‌క్షిణాది భాష‌లు తెలుగు, త‌మిళంను సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నైపుణ్యం హీరోయిన్ త‌మ‌న్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేక‌పోయింది త‌మ‌న్నా. అయితే ఆ లోటు ఈ సంవ‌త్స‌రం తీర‌బోతున్న‌ట్లే.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో నాగార్జున‌, కార్తీల‌తో క‌లిసి త‌మ‌న్నా న‌టించిన 'ఊపిరి' (త‌మిళంలో తోళా) చిత్రం కోసం.. తెలుగు వెర్ష‌న్ కోసం త‌న గొంతు వినిపించే ప్ర‌య‌త్నం చేసింది త‌మ‌న్నా. ఈ సినిమా రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్‌కి మాత్రం అరువు గొంతుపై ఆధార‌ప‌డ‌క‌త‌ప్ప‌లేదు ఆమెకి. అయితే మ‌రో త‌మిళ చిత్రం కోసం మాత్రం త‌మ‌న్నా గొంతుని స‌వ‌రించుకుంటోంది.

'ధ‌ర్మ‌దురై' పేరుతో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న చిత్రం కోసం త‌మ‌న్నా మ‌ధురై యాస‌తో కూడిన త‌మిళ్‌ని త‌న సొంత గొంతులో వినిపించ‌బోతోంది. మొత్త‌మ్మీద 2016 సంవ‌త్స‌రంలో.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌న్న త‌మ‌న్నా కోరిక నెర‌వేరుతున్న‌ట్ల‌య్యింది.

More News

నాలుగోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చిన‌ విక్ర‌మ్‌

'మ‌నం' చిత్రంతో తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.. ప్ర‌స్తుతం సూర్య‌తో '24' అనే సైంటిఫిక్ ఫిక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా ఆర‌వ చిత్రం. ఈ సినిమా కోసం ఓ అంశాన్ని విక్ర‌మ్ నాలుగోసారి రిపీట్ చేస్తున్నాడు.

'అ..ఆ..'తో  బ్రేక్ ప‌డుతుందా?

'ఇష్క్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. అయితే.. ఆ త‌రువాత న‌టించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు.

అలా..చేస్తే త‌ప్పు ఏమిటి అంటున్న వంశీ పైడిప‌ల్లి..

మున్నా చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతో విజ‌యం సాధించ‌లేక‌పోయినా బృందావ‌నం, ఎవ‌డు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు.

చిరు - నాగ్ త‌ర్వాతే బాల‌య్య‌..

మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున త‌ర్వాతే న‌ట‌సింహం బాల‌య్య‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే క‌వ‌ర్ పేజీ పై  బాల‌య్య లెజండ‌రీ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు 3 గంట‌ల‌కు స‌చివాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు.

చైతు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న మంజిమా మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.