ఇదేం పెళ్లా.. బొట్టి పెట్టి పిలవడానికి..: తమ్మారెడ్డి

ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ బొట్టు పెట్టి మరీ పిలవరని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఇవాళ మెగాస్టార్ చిరు ఇంట్లో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వివాదంపై మాట్లాడారు. నేను బాలకృష్ణ కంటే గొప్పోన్ని కాదు.. నన్ను కూడా ఎవరూ పిలవలేదు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో వాళ్లనే పిలుస్తారు. ఎవరితో అవసరం ఉందో వారిని మాత్రమే పిలుస్తారు. దీనికి ఫలానా వాళ్లను పిలవలేదు.. ఇదేం ఎవరి పెళ్లి కాదు బొట్టుపెట్టి పిలవడానికి ఎవరికివారు ఇన్సూర్ తీసుకుంటారు. లేకుంటే ప్రభుత్వమే ఎవర్నయినా పిలిస్తే వాళ్లు మాత్రమే వెళ్తారు. వాళ్లు పిలిచిన వారం మాత్రమే వెళ్తాం కానీ అందరం వెళ్లలేం కదా..?. నన్ను కూడా పిలవలేదు.. మరి నేను బాధ పడాలి కదా మరి’ అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

బాలయ్య లేకుండా ఇండస్ట్రీ లేదు..!

బాలయ్యతో అవసరం ఉంటే కచ్చితంగా ఆయన దగ్గరికెళ్తారు. షూటింగ్స్ విషయం మాత్రమే మాట్లాడారు. పలానా వాళ్ళను పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. దాన్ని ఇష్యూ చెయ్యాల్సిన పని లేదు. మహేష్ బాబు, వెంకటేష్, రాజశేఖర్ ఇలా చాలా మందిని పిలవలేదు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటే అర్థం లేదు. నన్ను కూడా పిలవలేదు.. పిలవలేదంటే పిలవలేదు అంతే. బాలయ్యను కూడా పిలిచి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా పిలిచి మాట్లాడతాం. అప్పట్లో హరికృష్ణగారిని కూడా పిలిచి మాట్లాడతాం. ఇప్పుడు కూడా టైమ్ వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడుతాం. బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఉందని ఎలా అనుకుంటాం. ఏ అవసరం వచ్చినప్పుడు ఎవర్ని పిలవాలో వారిని మాత్రమే పిలుస్తాం. అవసరమైనప్పుడు అందర్నీ సి. కల్యాణ్ అందర్నీ పిలుస్తారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాట్లాడారు’ అని తమ్మారెడ్డి మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.

More News

చిరు ఇంట్లో ముగిసిన సీసీసీ స‌మావేశం.. ఎవ‌రేమ‌న్నారంటే?

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందుల‌ను ఫేస్ చేసింది. ముఖ్యంగా సినీ కార్మికుల‌కు ప‌ని లేకుండా పోయింది.

‘నిమ్మగడ్డ’దే న్యాయం.. జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్‌కు హైకోర్టు మరో షాకిచ్చింది. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకూ హైకోర్టులో చాలా ఎదురుదెబ్బలే తగిలాయి.

‘ఆర్ఆర్ఆర్‌’లో ర‌కుల్ స్పెష‌ల్‌

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

డోంట్ వర్రీ.. ‘మిడత’ను ఇలా తరిమేయండి..!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ముప్పుతో యావత్ ప్రపంచం కకావికలం అవుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం..

ర‌ష్యాలో బాహుబ‌లి సంద‌డి

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన చిత్రం బాహుబ‌లి. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2500కోట్లను వ‌సూలు చేసింది.