close
Choose your channels

ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డికి మాతృ వియోగం

Monday, April 6, 2020 • తెలుగు Comments

ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డికి మాతృ వియోగం

టాలీవుడ్ ప్రముఖ ద‌ర్శక నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ్మారెడ్డి మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మీడియా ముఖంగా తోటి ఇండస్ట్రీ మిత్రులకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తమ్మారెడ్డి తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్దని ఆయ‌న కోరారు. ఇదిలా ఉంటే.. పలువురు మిత్రులు, సన్నిహితులు, ఇండస్ట్రీ పెద్దలు తమ్మారెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి.. తమ్మారెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు.

త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే అన్న విషయం తెలిసిందే. ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ‘ల‌క్షాధికారి’, ‘జ‌మీందారు’, ‘బంగారు గాజులు’, ‘ధ‌ర్మధాత‌’, ‘ద‌త్తపుత్రుడు’, ‘డాక్టర్ బాబు’ త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబం.

Get Breaking News Alerts From IndiaGlitz