దేశ‌దిమ్మ‌రి గా త‌నీష్

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) ఈ చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్నారు. దేశ‌దిమ్మ‌రిలో త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా  విడుద‌ల‌కు ముస్తాబౌతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాల్ని  జరుపుకుంటోంది .

ఈ చిత్రంతో త‌నీష్ త‌న‌లోని గాయ‌కుడిని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. హే పైసా అంటూ డ‌బ్బు పై వ‌చ్చే ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ని త‌నీష్ స్వ‌యంగా ఆల‌పించాడు. ఈ చిత్రాన్ని పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , హ‌ర్యానా, సిమ్లా వంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రించారు. దేశ‌దిమ్మ‌రి చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన‌ సంగీతం , ప్ర‌దీష్ ఆంటోని కొరియోగ్ర‌ఫీ రెండు హైలైట్ గా ఉంటాయ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు న‌గేష్ నార‌దాసి చెప్పారు. 

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ముస్తాబౌతున్న త‌మ దేశ‌దిమ్మ‌రి చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని,చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని.

సమ్మర్ లొనె ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి నంద‌మూరి హ‌రి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గా , మ‌ల్లిఖార్జున్ సినిమాటోగ్ర‌ఫీని అందించారు.

More News

ఎన్టీఆర్ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

వ‌రుస చిత్రాల్లోరాజ‌శేఖ‌ర్‌

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ రీసెంట్‌గా విడుద‌లైన `పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం` సినిమా స‌క్సెస్ అందుకుని ట్రాక్‌లోకి వ‌చ్చాడు.

భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ మీట్ ప్లేస్ మారింది...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోరూపొందిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`.

త‌మ‌న్నా పాత్ర ఏంటంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్పుడు క్వీన్ ప్రాజెక్ట్ పెండింగ్ ప‌డ‌టంతో త‌దుప‌రి సినిమాపై దృష్టి సారించింది.

త‌ప్పుకున్న తేజ‌

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం `య‌న్‌.టి.ఆర్‌`.