Anthele Katha Anthele: అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తనీష్, వికాస్ వశిష్ట ల 'అంతేలే కథ అంతేలే'

  • IndiaGlitz, [Wednesday,August 24 2022]

అనంతపురం బ్యాక్ డ్రాప్ లో  ఎమోషన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం అంతేలే కథ అంతేలే.రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ ,వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్), శ్రీనివాస్ నటీ నటులుగా మహారాజశ్రీ,లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కనున్న కొత్త చిత్రం అంతేలే కథ అంతేలే సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో

చిత్ర దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ :రిధిమ క్రియేషన్స్ పతాకంపై నా డైరెక్షన్ లో అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాము. సినిమా బండితో అందరినీ మెప్పించి నటువంటి నటుడు వికాస్ వశిష్ట ఇంకా తనీష్ హీరోలుగా .సెహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.నెస్ట్ మంత్ షూటింగ్ వెళుతున్న ఈ సినిమా  రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల  గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి.ఈ చిత్రాన్ని అనంతరం, నల్గొండ, హైదరాబాద్ లల్లో మూడు షెడ్యూల్ లో షూటింగ్  చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

హీరో తనీష్  మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా  ప్రేక్షకులు  అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి  చేస్తున్న  అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన  పాత్ర ఇది.ఇందులో  హ్యూమన్ రిలేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ను మంచి విజయం  సాదించాలి అన్నారు.

హీరో వికాస్ వశిష్ట  మాట్లాడుతూ .. సినిమా బండి తరువాత  చేస్తున్న ఈ సినిమా టైటిల్ లోనే కథ ఉంది. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి టీం దొరికింది. నివాస్ గారు ఈ కథ చెప్పినపుడు. చాలా నచ్చింది. ఇందులో ఎక్కువ మాటలు  ఉండవు కానీ ఎమోషన్ కథను క్యారీ చేస్తుంది.ఈ సినిమాను కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను.

హీరోయిన్ సహార్ కృష్ణన్  మాట్లాడుతూ..నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు  సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నా కిచ్చిన పాత్రను 100% ప్రేక్షకులను మెప్పించేలా పోసిస్తాను అన్నారు .

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ .. సీనియర్ నటి గీతాంజలి  రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు  మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది అన్నారు.

More News

కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా 'శశివదనే' ఫస్ట్ లుక్ పోస్టర్

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా మరియు RX 100 రాంకీ,సంగీత దర్శకుడు

Naa Venta Padathunna Chinnadevadamma: సెప్టెంబర్ 2 న “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” రిలీజ్

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి,

Raja Singh : లైన్ దాటారు.. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్, ఆ పదవిలోంచి కూడా తొలగింపు

ఓ వర్గాన్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై

Pawan Kalyan : జనసేనలో కోవర్టులు.. పక్కవాడికి సహకరిస్తే సస్పెన్షనే : నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

2024 ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.

"కార్తీక దీపం" దీప ఈజ్ బ్యాక్

"కార్తీక దీపం".. స్టార్ మా లోనే కాదు.. తెలుగు టెలివిజన్ లోనే ఒక పెద్ద సంచలనం. ప్రతి తెలుగు ఇంటినీ, ప్రతి గుండెనీ తట్టి ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన ధారావాహిక.