Taraka Ratna:పెళ్లయి, విడాకుల తీసుకున్న అమ్మాయితో వివాహం.. కుటుంబానికి దూరం: తారకరత్న లవ్‌స్టోరీలో ట్విస్ట్‌లు


Send us your feedback to audioarticles@vaarta.com


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే వుంది. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. అయితే తెలుగు మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఆయన కుటుంబం, భార్య గురించి కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా తారకరత్న ప్రేమ, పెళ్లి విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
ఇంటర్వ్యలో ప్రేమ, పెళ్లి విషయాలు పంచుకున్న అలేఖ్య:
ఒక సినిమా కథను తలపించేలా ఎన్నో ట్విస్టులు, సస్పెన్స్ తారకరత్న ప్రేమకథలో వున్నాయి. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. వీరిద్దరిది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారం లేకున్నప్పటికీ వీరు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను తెలియజేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సపోర్ట్‌తో పెళ్లి :
అలేఖ సిస్టర్‌కి తారకరత్న చెన్నైలోని స్కూల్ సీనియర్. అయితే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ హైదరాబాద్‌లో కలిశారు. ఆ పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. తొలుత తన తారకరత్నే ఆమెకు ప్రపోజ్ చేశారు. అయితే వీరిద్దరి పెళ్లిపై అలేఖ్య రెడ్డి తల్లిదండ్రులు నో చెప్పారు. సినీ పరిశ్రమ, అందులోని వ్యక్తులపై వారికి సదాభిప్రాయం లేకపోవడం వల్లే అలేఖ్య తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదు. అటు తారకరత్న కుటుంబం కూడా వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీనికి కారణం లేకపోలేదు.. అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లియి, భర్త నుంచి విడాకులు కూడా తీసుకోవడం. అయితే వీరి పెళ్లికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్ధతుగా నిలిచారట. 2012 ఆగస్ట్ 2న సంఘీ టెంపుల్‌లో వీరి పెళ్లి జరగ్గా.. ఇరు కుటుంబాల తరపునా ఎవరూ హాజరు కాలేదట. చాలా రోజుల వరకు ఈ జంటను రెండు కుటుంబాలు దూరం పెట్టాయట.
నాలుగేళ్లు కుటుంబానికి దూరంగా తారకరత్న:
ఈ దంపతులకు 2013లో నిష్కా పుట్టింది. అయితే పెళ్లయిన దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇరు కుటుంబాలు మళ్లీ కలిసినట్లు అలేఖ్య చెప్పారు. సినీ, రాజకీయ రంగాలను శాసించే నందమూరి కుటుంబానికి వారసుడిగా వున్నప్పటికీ.. ప్రేమ కోసం అన్ని వదులుకుని తారకరత్న ఫ్యామిలీకి దూరంగా వుంటున్నారు. అన్ని కష్టాలను ఎదిరించి నిలబడ్డ ఈ జంటకు అనుకోని ఆపద వచ్చింది. గుండెపోటుకు గురైన తారకరత్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ కష్టం నుంచి ఆయన కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.