close
Choose your channels

అవన్నీ రూమర్స్ మాత్రమే.. నాకంత ఆసక్తి లేదు: తరుణ్

Tuesday, July 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అవన్నీ రూమర్స్ మాత్రమే.. నాకంత ఆసక్తి లేదు: తరుణ్

బిగ్‌బాస్ అనగానే ఊహాగానాలు ప్రారంభమవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే బిగ్‌బాస్ నిర్వాహకులకు ఈ ఊహాగానాలే కంటెస్టెంట్ల ఎంపికలో సాయపడతాయేమో అనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్ల పేర్లలో ఈ సారి ఎక్కువగా హీరో, హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బిగ్‌బాస్ నిర్వాహకులు సోమవారం బిగ్‌బాస్ లోగోను విడుదల చేయడంతో మరోసారి ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. హోస్ట్ మొదలుకొని.. కంటెస్టెంట్‌లు వీరేనంటూ సోషల్ మీడియాలో హంగామా నడిచింది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖంగా హీరో తరుణ్ పేరు వినిపించింది. దీనిపై తాజాగా తరుణ్ స్పందించాడు. ‘‘ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో మీరంతా బాగున్నారని అనుకుంటున్నా. కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటు పేపర్లలోనూ నేను బిగ్‌బాస్ షోకి వెళుతున్నానంటూ నా గురించి చక్కర్లు కొడుతున్న న్యూస్‌ అంతా అబద్ధం. నేను ఆ షోలో కంటెస్టెంట్‌ని కాదు.. నాకు ఆ షోకి వెళ్లాలన్నంత ఆసక్తీ లేదు. అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. స్ప్రెడ్ చేయొద్దు’’ అని తరుణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.