త‌రుణ్ తాజా విశేషాలు

  • IndiaGlitz, [Thursday,November 09 2017]

'పెళ్లిచూపులు' సినిమా పేరు చెప్ప‌గానే అందులో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ఎంత మందికి గుర్తుకొస్తుందో, ఆ చిత్ర ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ పేరు అంతే మందికి గుర్తొస్తుంది. ఈ సినిమాతో త‌రుణ్ భాస్క‌ర్ తెచ్చుకున్న పేరు అలాంటిది మ‌రి. ఒక సినిమాకు రెండు జాతీయ అవార్డులను చాన్నాళ్ల త‌ర్వాత తెచ్చిపెట్టిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఇప్పుడు త‌న తాజా చిత్రాన్ని సెట్స్ మీద‌కు తీసుకెళ్తున్నారు.

ఈ సినిమాలో 'వెళ్లిపోమాకే' ఫేమ్ విశ్వ‌క్ సేన్ ఓ హీరోగా న‌టిస్తున్నారు. ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య సాగే సినిమాగా ఈ తాజా చిత్రాన్ని త‌రుణ్ తెర‌కెక్కిస్తున్నారు. మ‌రో స్నేహితుడి పాత్ర‌కు కొత్త వ్య‌క్తిని తీసుకున్నారు. ఒక నాయిక‌గా అనీషా ఆంబ్రోస్‌ను నిర్ణ‌యించారు. 45 రోజుల్లో ఈ సినిమాను తెర‌కెక్కించాల‌నే స‌న్నాహాల్లో ఉన్నారు త‌రుణ్‌.

సో ఈ సినిమా కూడా కొంద‌రు యంగ్ టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌నున్న‌ద‌న్న మాట‌. మ‌రో విష‌యం ఏంటంటే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో త‌రుణ్ త‌ల్లి గీతా భాస్క‌ర్ క‌నిపించ‌నున్నారు. ఆమె 'ఫిదా' చిత్రంలో సాయిప‌ల్ల‌వికి అత్త‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.

More News

అనుష్క ప్రేమించింది అత‌న్నే!

త‌ను ప్రేమించిన వ్య‌క్తి గురించి స్వీటీ అనుష్క బాహాటంగానే చెప్పింది. ఒకానొక స‌మ‌యంలో ఆమె అత‌ని ప్రేమ‌లో పీక‌ల్లోతు కూరుకుపోయిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించింది.

హిట్ డైరెక్ట‌ర్‌తో అనీషా....

గోపాల గోపాల‌, ర‌న్ వంటి చిత్రాల్లో మెప్పించిన హీరోయిన్ అనీషా అంబ్రోస్‌..హీరోయిన్‌గా మ‌రో చిత్రంలో ఎంపికైంది.

మారుతి కొత్త ప్లాన్‌...

డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌కత్వం వైపే కాకుండా నిర్మాణ రంగంలో కూడా త‌న‌దైన రీతిలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మారుతి టాకీస్ అనే బ్యాన‌ర్‌ను స్థాపించి, త‌న శిష్యుల‌కు ద‌ర్శ‌కులుగా అవ‌కాశం ఇస్తూ వ‌స్తున్నాడు.

మూడు సినిమాలతో రాజీవ్ సాలూరి

సంగీత దర్శకుడు  కోటి కొడుకుగా చిత్ర పరిశ్రమలొకి వచ్చాడు .. చెసింది మూడు నాలుగు సినిమాలె అయినా నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు రాజీవ్ సాలూరి.

నాని డైరెక్ట‌ర్‌తో మెగా హీరో...

కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్న మెగా హీరో వ‌రుణ్ తేజ్‌. ఈ పొడుగు హీరో ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.